పండుగంటే

Advertisement
Update:2023-10-24 13:40 IST

అమ్మే సృష్టికి మూలమనీ

ఆదిశక్తి అమ్మ అనీ

అనంత రూపాల తల్లి అనీ

రౌద్ర కరుణాల అల్లిక. అనీ

జగతికి తెలిపిన దసరా పండుగ...!

అరిషడ్వర్గములనే రావణుని

సంస్కార బాణాల వధించిన

దుష్ట అసుర గుణాల సంహారమనీ

పర స్త్రీని కోరిన పతనమనీ

లోకానికి చాటిన దసరా పండుగ....!

దయా,క్షమ, దక్షతలు

జ్ఞానం ,ధ్యానం సాధనలు

పరమత సహనం,పరహిత మననం

ఇవే భారతీయుని ఆయుధములనీ

చాటి చెప్పిన దసరా పండుగ....!

పండగంటే వండుకు తినడం కాదు

పండుగంటే సహాధ్యాయం

పండుగంటే ప్రకృతితో అనుసంధానం

పండుగంటే జాతి జాగృతం

అదే..అదే .. మరి దసరా పండుగ...!

రమాదేవి కులకర్ణి

( హైదరాబాద్ )

Tags:    
Advertisement

Similar News