లక్ష్మీ పుట్టిందంటారు,
లక్షలు తెమ్మంటారు
గుణం ఉండాలంటారు,
ధనంతోనే బేరీజేస్తారు
అంతా నీదేనంటారు,
ఆద్యంతం నియమాలెడతారు
ప్రకృతివంటూ పోలుస్తారు ,
పంజరంలోనే ఉంచుతారు
ఆడ మగ ఒకటంటారు
ఒకటేలా కుదురుతుందంటారు
నేనే వ్యవస్థనంతా చేసానంటాడు,
అస్తిత్వాన్ని మాత్రం నీలో దాచుకొంటాడు
ప్రగతి ప్రతినిధివంటారు,
ప్రతిదీంట్లొ నీకెందుకంటారు
కవితకి ఊహవు నువ్వే
కథకూ ఊతము నీవే
కమామిషు నీవే
ఖర్మ నీతో అనుకొంటారు
అర్థరాత్రి నడివగల్గితే,
స్వాతంత్రమన్నారు
పట్టా పగలే కనిపిస్తే,
హరిస్తున్నారు
ప్రసంగాలలో ఉపోద్గాతంవు
ఎన్నికలకు ఊపిరివు
రాజకీయాల్లో ఉత్తితివి
నువ్విచ్చేది తెలుసుకోరు,
నీకు రావాల్సింది తేల్చేస్తారు
ఆధునికం అంటూ నినాదాలిస్తారు,
అలా ఉంటే కళ్లలో నిప్పులోసుకుంటారు
తరం మారింది
సమాజమూ మారుతోంది
నువ్వెప్పుడు మార్చుకోగలవు
రామ్.చింతకుంట
Advertisement