అన్నా చెల్లెళ్ల అనుబంధం

Advertisement
Update:2023-08-30 23:40 IST
అన్నా చెల్లెళ్ల అనుబంధం
  • whatsapp icon

ఈ సృష్టిలో మరుపురాని మధురమైన విడలేని

జన్మజన్మల బంధం ఈ బంధం రక్తసంబంధం

అన్నయ్య తో నా అనుబంధం

ఒక్క మాటలో చెప్పాలంటే

నాన్నకు మరో రూపం ఈ భూప్రపంచం మీద అన్నయ్య అని చెప్ఫాలి

అన్నీ తానై నాన్న లా చూసుకున్నాడు

ఇప్పటికి అలానే చూసుకుంటాడు

ఎంతో సంతోషాన్ని ఇచ్చే సంఘటన నా జీవితంలో

చోటుచేసున్నది.

అదేమంటే -

నాకు జీవిత భాగస్వామిని ఎంపిక చేసే విషయంలో నాకు తెలియకుండానే

జరిగింది .అది కూడ నా మనస్సుకు నచ్చిన మెచ్చిన వరుడితో .

అంటే నా మనస్సులో భావాలను తెలుసుకున్నట్లుగా కుదిర్చాడు సంబంధం .

నాకు పెద్దకుటుంబం కావాలని మరుదులు

ఆడపడుచులు వుండాలని మనస్సులో వుండేది .

ఆ నా కల అన్నయ్య మనస్సుకు ఎలా తెలిసిందో ఇప్పటివరకు

నాకు అర్దం అవ్వదు.

నా మనస్సులో

అన్నయ్యకు కృతజ్ఞతలు ఆనందంగా తెలియచేసుకున్నా..

అన్నయ్య రాఖీ పండుగ

బహుమతిగా

నాకు ఒక మంచి

భాగస్వామిని ఇచ్చాడు...

అన్నయ్య ఋణం

ఈ జన్మలో తీర్చుకోలేనిది

( అన్నయ్య శ్రీ అచ్యుత రామశాస్త్రి కి )

-తెల్లదేవరపల్లి శాంతి

(సింగపూర్)

Tags:    
Advertisement

Similar News