మరుగై పోయిన మంచి అన్న

Advertisement
Update:2023-08-30 23:52 IST

ప్రియమైన పెద్ద బాబూ!

ఎక్కడ వున్నా నీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. నువ్వు అన్నయ్య వైనా ఇంట్లో అందరికి పెద్దబాబు అని ప్రేమగా పిలవటమే అలవాటు.

గోపీచంద్ గారి పెద్దకొడుకువి, మా అందరిలో అందగాడివి, తెలివైన వాడివి. డాక్టర్ రమేష్ బాబు అంటే మాకే కాదు అందరికి ఆరాధన, ఇష్టం. రచయితవి కూడా. మానవత్వంకి ఎంత పేరు!

ఇంగ్లాండ్ లో డాక్టర్ గా పేరు లో వున్నావు. ఆకస్మికంగా నలభై ఆరు ఏళ్ళకే వెళ్లి పోయావు. అప్పటి నించి ఇప్పటికి కళ్ళు, మనసు రోదిస్తూనే వున్నాయి.

ఇది మన కర్నూలు ఫోటో. నువ్వు నా బాల్య స్నేహితుడివి. కొట్టుకొంటూ, ఆడుకొంటూ పెరిగాం. మంచి అన్న మా రమేష్ బాబు. ఒక మేధావి ని పోగొట్టుకొన్నాము.

నువ్వు నవ్వుకుంటూ ఇంట్లోకి వస్తావని నాకు అనిపిస్తూ వుంటుంది .రా పెద్దబాబు!..

ప్రేమతో

చిన్ని.

(అన్న : త్రిపురనేని గోపీచంద్ కుమారుడు కీ.శే.డా.టి .రమేష్ బాబు )

-శ్రీమతి కాట్రగడ్డ రజని

Tags:    
Advertisement

Similar News