టేబుల్

Advertisement
Update:2023-01-18 17:40 IST
టేబుల్
  • whatsapp icon

ఆ టేబుల్ అంటే నాకు ప్రాణం

ఆ టేబుల్ నా జీవితానికి

ఒక గమ్యం చూపించింది

చిన్ననాటి జ్ఞాపకాలను

ఎన్నో పదిలంగా

నా మదిలో నిలిపింది.

ఆ టేబుల్ పై నేనురాసిన

కథలు ,కార్టూన్లు ,కవితలు

చదివిన పుస్తకాలూ

వ్రాసిన పరీక్షలు

నా జీవితాని కి

ఒక దారి చూపించింది

అందుకే ఆ టేబుల్ అంటే

నాకు ప్రాణం

రాత్రుళ్లు చదువుకుంటూ

ఆ టేబుల్ పై తల ఆనిచి

నిద్ర పోయిన రోజులు

ఆ టేబుల్ కోసం

తమ్ముడితో తగవులాడిన రోజులు

ఒకరి తరువాత ఒకరు

దాన్ని చదువుకోసం

పంచుకున్న రోజులు

అది నేడు కనుమరుగైనా

నా మదిలో నేటికీ కదిలాడు

ఒక తియ్యని తీపిగుర్తు

- రాధాయి

(అగమ నగర్ , హైదరాబాద్)

Tags:    
Advertisement

Similar News