మైసూరు దసరా
జగత్తుకే ఓ... అందం చందం
అందరం ఆనందంగా
సంబరాలు చేసుకొందాం
నవరాత్రులలో
మైసూరు నగరం
విద్యుత్ వరుసదీపాల
వెలుగులు చూద్దాం
రాజుగారి కోట రంగురంగుల దివ్వెల మామిడి తోరణాలు
నింగినుంచి దివికి దిగివచ్చిన
తారల సిరుల తళుకులు
బంగారు సింహాసనముపై ఒడయారు దర్బారు
అట్టహాసాల జాతర
విజయదశమి రోజు
విశ్వవిఖ్యాత ఊరేగింపు శ్రేష్టం
ఎక్కడెక్కడోనుంచి తరలివచ్చిన జనసందోహాలు
కిక్కిరిసిన రైలు బస్సులు
రభసల రొదలు
చిత్రవిచిత్ర వేషాలు
జంబుసవారి
బంగారు మండపంలో
ఊరేగింపులు
అంబారిలో అపరంజి సింహవాహిని చాముండి చల్లనిదేవి వజ్ర వైఢూర్య మణుల థళథళ జిగిబిగుల శోభలు
మహిషాసురుమర్ధని
లోకశాంతి దాయిని
నవదుర్గరూపిణి
ఆయిగిరినందిని
నందిత మోదిని మహిషాపురవాసిని
విద్యా వేద్యమహిమా
శ్రీ చక్రపురవాసిని
మనోన్మణి
కోరిన వరములు శుభాలిచ్చి దీవించుతల్లి
సాంస్కృతిక కళల
వాద్యసంగీత
జానపద ఆధునిక
నృత్య ప్రభల
దసరా ఉత్సవాలలో
ఉత్సాహంగా
మనం సాగుదాం
కన్నులు మిరిమిట్లుగొలిపే ఉద్యానవన సౌందర్యాలు తిలకిద్దాం
చూచువారలకు చూడ ముచ్చటగొలుపు
ఆట పాటలలో తేలుదాం
పసందైన కర్ణాటక ఆహారాల సవిరుచులు తిందాం
అహహ భోజనంబు వింతైన వంటకాలు బొజ్జనిండుగా ఆరగించుదాం
సుమభరిత వివిధ
వర్ణవర్ణ విరుల నవ్వుల పులకరించుదాం
ఎగ్జిబిషన్ లో మైసూరుపాకు,బిసిబేళబాత్, మసాలదోస,
ಧಾರವಾಡ మిర్చిబజ్జిలు నోరువూరించు
దేశ విదేశ అతిధుల రాకలు తొక్కిసలాటలతో
శమీవృక్ష పూజలు,
టార్చెలైటు పెరేడు...
అబ్బబ్బా! ఒకటేమిటి
ఇలా ఎన్నెన్నో అద్భుతాలు ఇలకే మైసూరు
ఒక ఇంపు సొంపుల స్వర్గధామమే
అది,నేను నివసించు
నివాసమే సుమా!
మరి తరలిరండి !తరించండి !!తబ్బిబ్బుల సంతసించండి!!
ప్రభాశాస్త్రి జోస్యుల
(మైసూరు)