రహదారి లో .......

Advertisement
Update:2022-11-09 11:51 IST

ఆ ఊరినీ ఈఊరినీ కలిపే దారి. బంధాలు పెంచి

అనుబంధాలు కలిపి

బంధుత్వాలు పెంచేది రహదారి.

వీధి వ్యాపారులకు బ్రతుకు దారి. ఆశలు ఆశయాలుతీర్చేది రహదారి. బతుకు గమ్యం చేర్చేది రహదారి.

ఇల్లేమో ఇంద్ర భవనం

రహదారంతా కంపు మయం.

పంతులుగారి పూజ నిర్మాల్యం,

రెడ్డి గారు రాత్రి తిన్న బిర్యానీ ముక్కలు,

రాజు గారి ఇంటి నుండి కోడి పలావు ఆకులు, ఈకలు.

తెల్లారేసరికల్లా చెత్తకుప్పలలో

జుయ్యీ మంటూ ఈగలు దోమలు. వీధి పశువులు, కుక్కల,కొట్లాటలు. కర్రతో వాటిని అదిలిస్తూ

పాత పేపర్లు వాడు.

ఎవరి బ్రతుకు పోరాటం వారిది. ఆసుపత్రి, పరిశ్రమల చెత్త

వాటిని కెలుకుతున్న పందులు.

ప్రతీ వీధిలో తెల్లవారేసరికి

ఇదే చిత్రం.

రవి వర్మ చిత్రం కాదు.

రహదారి మీద వేసిన చెత్త చిత్రం. సీజన్లో డెంగ్యూ జ్వరాలు,

నరాలు వంగిపోయిన జనం. వణికిస్తున్న చలి జ్వరాలు.

ఆస్పత్రిలో లక్షల్లో ఫీజులు.

సీజన్ సీజన్ కి రకరకాల అనుభవాలు.

చేదు అనుభవాలైనా మారని జనం.

పరిశుభ్రత గాంధీజీ లక్ష్యం

వీధిలో ఉన్న గాంధీబొమ్మ ని కూడా వదలని జనం.

బొమ్మ చుట్టూ ఉండే

గచ్చు అంతా గలీజ్.

బొమ్మే కదా మాట్లాడదని ధైర్యం. ఎవరు నేర్పుతారు నీకు పరిశుభ్రం.

స్వచ్ఛ భారత్

మోడీ ప్రధాన ఆశయం.

కాగితాలకే పరిమితమైంది లక్ష్యం. తెల్ల డ్రెస్సులతో

స్వచ్ఛభారత్ పరుగులతో

తీరదు ఆశ.

ఎవరి వాకిలి వారే

ఎవరి వీధి వారే

చెయ్యాలి పరిశుభ్రం.

కలిసికట్టుగా పనిచేస్తే

కలదు సుఖం.

పరిశుభ్రత దీక్ష

తీసుకోవాలి మనం.

-మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు. (సామర్లకోట)

Tags:    
Advertisement

Similar News