'స్త్రీ' యను శబ్దమునకున్న
ప్రేమ పూర్వకార్థ మేమి?
"సంతానమ్మీమె నుండి
సాక్షాత్కారము నొందును!
సృష్ఠికర్తతో సామ్యము
స్త్రీమూర్తికె సముచితమ్ము!
సత్యమునకు,
శాంతమునకు,
సహనమునకు మందిరమ్ము!
సృష్టి సాంత మెదురిడినను
శిశువు నెవరి
కొసగ బోదు!
తన ఆకలి రగులుచున్న,
తన బిడ్డను నవయనీదు!
లేమి యనుట కాననీక,
లేమ, కాపురము దిద్దును!
మగని మొగము నందు నవ్వు
దిగజార్చదు యే ప్రొద్దును!
ఏ ప్రతిఫల మాశింపక,
ఇంటికర్పణమగు నారి!
మగువ తెగువ ముందు,
మున్ను,
ముగురు మూర్తు లల్పు లైరి!
-ఎన్.ఆర్.తపస్వి
(గోవాడ గ్రామం,తెనాలి)
Advertisement