'నిఖిలలోకం', ' సాహిత్య సంగమం' నిఖిలేశ్వర్ గ్రంథాల ఆవిష్కరణ సభ

Advertisement
Update:2023-08-14 01:07 IST

ప్రముఖ కవి ,అనువాదకులు ,దిగంబర కవులలో ఒకరుగా ప్రసిద్ధులు అయిన శ్రీ నిఖిలేశ్వర్

రాసిన 60 ఏళ్ల సాహిత్య జీవిత అనుభవాల స్వీయ చారిత్రాత్మక గ్రంథం ' నిఖిల లోకం 'అలాగే ఒక 35 మంది సన్నిహిత సాహిత్య పరిచయస్తుల గ్రంథం

'సాహిత్య సంగమం ' ఆవిష్కరణ సభ ఈ రోజు 13 ఆగస్టు '2023 ఆదివారం ఉదయం బాగ్ అంబార్ పేట్ శివంరోడ్ లోని సురభి గ్రాండ్ 3 వ అంతస్తు హాల్ లో ప్రముఖ కవి కె. శివారెడ్డి అధ్యక్షతన జరిగింది .పుస్తకాలను ప్రముఖ దిగంబరకవి నగ్నముని (శ్రీ మానేపల్లి హృషీ కేశవరావు ) ఆవిష్కరించారు



సామాజిక సందర్భం మారినప్పుడల్లా కవిత్వ భాష కూడా మారాలని ,దిగంబర కవిత్వం అలా తమకు తొలినాళ్లలో స్ఫూర్తి దాయకమై నిలిచిందని శ్రీ కె శివారెడ్డి అన్నారు .




నిఖిలేశ్వర్ తో తమ అనుబంధాన్ని సాటి దిగంబర కవిగా నగ్నముని వివరిస్తూ జ్వాలాముఖి ఆరేటర్ గా ఎంత ప్రభావోపేతుడో అతనికి అంత జంట స్నేహితునిగా నిఖిలేశ్వర్ సున్నితంగానే నిష్కర్ష గా మాట్లాడే కవి అని పేర్కొన్నారు .






నిఖిలలోకం పుస్తకం గురించి గ్రంథాలను ముద్రించిన ఎమెస్కో సంపాదకులు డా. డి. చంద్రశేఖరరెడ్డి ,సాహిత్య సంగమం పుస్తకాన్ని శ్రీ జితిన్ కుమార్ పరిచయ ప్రసంగాలు చేసారు











అనంతరం ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీ కె.శ్రీనివాస్ , ఓల్గా , తెలకపల్లి రవి , నందిని సిధారెడ్డి , ప్రభృతులు అభినందన ప్రసంగాలు చేశారు.

ఇటీవల అస్తమించిన గద్దర్ , సియాసత్ ఎడిటర్ జహీర్ అలీ ఖాన్ లకు సభ సంతాపం ప్రకటించాక నిఖిలేశ్వర్ తమ సంస్పందన ప్రసంగం చేస్తూ ఎన్నో ఏళ్లుగా తనకు డైరీ రాసే అలవాటువుందని కానీ స్వీయచరిత్రలో అవన్నీ ఉటంకించడం సాధ్యం కాదనీ , తన ఇన్నేళ్ల సాహిత్య జీవిత అనుభవాలను కొంత కుదించుకునే ఈపుస్తకం రాశానని , తనకు రిగ్రెట్స్ ఏవి లేవని , కుటుంబ సమాదరణకూడా ఉందని పేర్కొన్నారు . నిఖిలేశ్వర్ తమ కుటుంబ సభ్యులందరినీ సభకు పరిచయం చేసారు .

ఎందరో సాహితీవేత్తలు , నిఖిలేశ్వర్ బంధుమిత్రులు పాల్గొన్న ఈ సభ నిండుగా సాగి విందు భోజనంతో పరిపూర్ణమైంది.

Tags:    
Advertisement

Similar News