తొలితరం తెలుగు భావకవి, భారత స్వాతంత్ర్యసమరయోధుడు.
నాయని సుబ్బారావు గారు అక్టోబర్ 29, 1899న ప్రకాశం జిల్లా పొదిలి పట్టణములో జన్మించారు
ఈయన రచనలలో ప్రముఖమైనది 1937లో రాసిన సౌభద్రుని ప్రణయ యాత్ర అనే ఆత్మ కథాత్మక కావ్యం. ఈయన మాతృగీతాలు (1939), వేదనా వాసుదేవము (1964), విషాద మోహనము (1970) అనే స్మృతి కావ్యాలూ, జన్మభూమి (1973) అనే మహాకావ్యమూ రాశారు
సుబ్బారావు స్వాతంత్ర్యపోరాటములో సహాయనిరాకరణోద్యమములో పాల్గొన్నారు. ప్రముఖ తెలుగు కవయిత్రి నాయని కృష్ణకుమారి ఈయన కూతురు. విశ్వనాథ సత్యనారాయణ, తన వేయి పడగలు నవలలో కిరీటీ పాత్రను నాయని సుబ్బారావు దృష్టిలో పెట్టుకునే చిత్రించారు.
1928 నుండి అధ్యాపక వృత్తిలో కొనసాగి, 1955లో గుంటూరు జిల్లా, నరసరావుపేట పురపాలక ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదవీ విరమణ చేసిన సుబ్బారావు గారు1958లో హైదరాబాదు నగరంలో నివాసమేర్పరచుకొని హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో ఆయా ప్రసారాలకు అవసరమయ్యే విషయాలను వ్రాసే పనిని చేపట్టారు. ఎక్కువగా గ్రామస్థుల కార్యక్రమాలకు వ్రాస్తుండేవారు. స్త్రీల కార్యక్రమాలు నడిపే న్యాయపతి కామేశ్వరి కూడా సుబ్బారావుగారిచే చే తన కార్యక్రమాలకు కవితలు, పద్యాలు, నాటికలు వ్రాయించుకునేవారు
హైదరాబాదుకు వచ్చిన కొత్తలో వివిధ అంశాలపై వ్రాసిన 25 ఖండికలను భాగ్యనగర కోకిల అనే కావ్యంగా ప్రకటించారు
నాయని సుబ్బారావు 1978 జూలై 8న మరణించారు.
ఇవాళ వారి వర్థంతిసందర్భంగా స్మృతి నివాళులు