ఉత్తుంగ తరంగ తాడిత
పృథు శిలా సంకులిత
సైకత తీరాన
ఈ విశాఖలో
నా అడుగుల ముద్రలు
ఎన్నెన్నో ఏళ్ల వెనుక!
నేను నడిచిన తీరరేఖల
నిస్తుల సౌందర్య కాంతులు
నిండుగా మెరిసిపోతూ
ఇప్పటికీ నాలో!
… … …
కర్పూర గంధస్థగిత
నిర్భర మరుద్వీచికలా
చల్లగా చుట్టుకునే
చెరపరాని స్మృతి విశాఖ
నాకూ ఈగడ్డకూ మధ్య
కాలం దించిన నీలితెరలు
భవనాలై రాజ మార్గాలై
కిటకిటలాడే
ఆశేష జనసందోహ సంభ్రమాలై
… …. ….
ఆత్మను పోల్చుకోనీయని
అతి చిక్కని మాయావరణంలాగా
నాకూ ఈ విశాఖకూ మధ్య
నానాటికీ పెరిగిపోయే
నాగర జీవన వైఖరి
- నాయని కృష్ణకుమారి
(కొన్ని కవిత్వ పంక్తులు)
Advertisement