దాహం తీర్చే తియ్యటి ఊటల
ఊసేలేదు
దరికి చేర్చే బంగారుబాట
పడనేలేదు.
ధైర్యాన్నిచ్చి నడిపించే బావుటా
ఎగరట్లేదు
మనసుకు హాయినిచ్చే
వెన్నెలపాట
ఏ కోకిలా పాడట్లేదు.
మనల్ని తట్టిలేపే మంచిమాట
ఏ వేదికపైనా విన్పించట్లేదు.
అయినా చిన్నకాల్వలా
సంజీవనీ నది ప్రవహిస్తూనేవుంది.
సూర్యాస్తమయాల
కాలంలోనూ
వెలుగుతున్నదివ్వెను పట్టుకుని వెతికితే
సూర్యోదయాల రథం
కదుల్తూనే వుంది.
- నవీన్
( మహబూబ్ నగర్ )
Advertisement