అర్ధాల అమరికలో
ఆలూ మగలు
అందంగా ఒదిగినప్పుడు
మాటల చేతల
యుద్ధం ఉండదు కదా...
పంతాలు పట్టింపుల
ఊయలూగ నప్పుడు
ఆవేదనల సమర భేరి
మోగదు కదా....
నా మాటే వినాలనే
పట్టు దలల పెంకితనం
పగ్గాలు దూరంగా విసిరేస్తే
పరవశాల జీవన నావ
పరుగులు తీయదా...
సమానవత్వపు ఆలోచనలు
మస్తిష్కంలో నింపుకుని
శాంతి కపోతాల వోలే
ఆలోచనల పుటలు తిరగేసినప్పుడే
నవ జీవన శోభ వెల్లి విరియదా...!!
మొహమ్మద్. అఫ్సర వలీషా
(ద్వారపూడి (తూ .గో .జి ))
Advertisement