విహారి గారికి సాహిత్య పురస్కారం

Advertisement
Update:2023-08-23 17:53 IST

అనుమాండ్ల భూమయ్య సాహిత్య పురస్కారం 2023 సంవత్సరానికి గాను విహారి ( జె. యస్. మూర్తి) గారికి ఇవ్వటానికి పాల్కురికి పీఠం, హైదరాబాద్ నిర్ణయించింది.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ తంగెడ కిషన్ రావు గారి అధ్యక్షతన నిపుణుల కమిటీ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు తెలియజేశారు.

ఈ పురస్కారం క్రింద పది వేల రూపాయిల నగదు, జ్ఞాపిక అందజేసి, శాలువాతో సత్కరిస్తారు.

విహారి గారు శ్రీ పద చిత్ర రామాయణం రాశారు. ఇది ఆరున్నర వేల పద్యాల మహా కావ్యం. యోగ వాసిష్ఠ సారము మొదలైన పద్య కావ్యాలు అనేకం రాశారు. కథా నవలా రచయితగా సుప్రసిద్ధులు. వివిధ పత్రికలలో వ్యాసాలు, సమీక్షలు రాశారు.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం, అజో విభొ కందాళం ఫౌండేషన్ వారి ప్రతిష్ఠాత్మక ప్రతిభా పురస్కారం మొదలైనవి ఎన్నో అందుకొన్నారు.

సెప్టెంబర్, 5 నాడు తెలుగు విశ్వవిద్యాలయం లో జరుగనున్న సభలో విహారి గారికి ఈ పురస్కారం అందజేస్తారని సంస్థ అధ్యక్షులు తెలియజేశారు.

-ఆచార్య అనుమాండ్ల

భూమయ్య

అధ్యక్షులు

పాల్కురికి పీఠం. 

Tags:    
Advertisement

Similar News