గుక్కెడు నీళ్లకోసం ...! (కవిత)

Advertisement
Update:2023-09-29 12:48 IST

కత్తినిప్పుడు

నెత్తి నెక్కించుకోనక్కర్లేదు

నెత్తుటి మొగ్గ

విఛ్ఛిత్తి కావడం వింత కాదిప్పుడు..

గుండె గొతుక్కి గుక్కెడు నీళ్ళిమ్మని

కండ్లకు గండ్లు పడేలా ప్రార్ధించేది

మానవత్వం మాటలు విప్పాకనే...

మబ్బుల చెవుల్ని పిండి

మంచితనపు వర్షం

కురిపించగలగడమే

ప్రార్ధించే మనసుకు సుప్రభాతం !

సేవ చేద్దామనే లక్ష్యం సెలయెరై

మానసం నిష్కల్మష సరోవరమైతే

ఖాళీ చూపు కూదా పాశుపతాస్త్రమై

పాతాళ గంగను శాసిస్తుంది...

పైకి తెస్తుంది.

అపర భగీరత్వ సిద్దికి

ఆశయం గులకరాయి

ఒక్కటి చాలు!

-కొత్తపల్లి ఉదయబాబు

(సికిందరాబాద్)

Tags:    
Advertisement

Similar News