కలం తీసి పట్టుకుంటే
కరవాలం ముట్టుకున్నట్టే ఉంటుంది...
కవిత రాయాలని పరితపిస్తే
కదన రంగంలో ఉన్నట్టుగా
వెన్నెల కై వెదికే కన్నులలో
నిప్పులు కురిపించినట్టుగా
థీమ్ కోసం వెతుకుతున్న మనసును
థియరీలు వెక్కిరిస్తాయి
సిద్ధాంతాలన్నీ గెలిచిన వేళ
వెలసినవి కాదు
యుద్దాలై సాగిన బ్రతుకులవి
ఆకలి ప్రేగులను మీటిన కారపు
మెతుకులవి...
ఓటములన్నీ
వెక్కిరిస్తాయనుకుంటామా
అయినా
యుద్ధం చేసి తీరాల్సిందే
సిద్ధాంతం ప్రతిపాదించేది ఓటమే మరి
అహంకారం తలదాల్చిన గెలుపు
చతికిలపడి పోవాల్సిందే...
-కోడూరి రవి,(జూలపల్లి)
Advertisement