నగరం
నగవులన్నీ పల్లె పాదాల
కదలికలపైనే...
కార్తులెంతగా కసరత్తు చేస్తే
కీర్తి తనకు మిగిలేను
ఆకుపచ్చ గా
విచ్చుకున్న భూనభోంతరాలలో
పస్తులై మాడిన పగటి పూటలు
నిద్ర విడిచిన ఆకలి రాత్రులు
ఎలా లెక్కలు కట్టేది
రుణమెవరు తీర్చేది
నయగారమొలికే
నగరాన్ని ఏమని అడిగేది
చెమట చిందిన సెలయేరై
నెత్తుటి అలల వాగు నీరై
సంపదలన్నీ
పట్నపు కడలిలో కుమ్మరిస్తున్నాము...
చింత లేదులే-
చిగుళ్ళు తొడిగిన అందాలన్నీ
లోలోతుల్లో నిలిచిన
వేళ్ళ బంధాల వేగా...
-కోడూరి రవి,
Advertisement