వర్షాలతో సతమతం
భాగ్యనగర జీవనం
వత్సరాలు గడిచినా
తరగని భీభత్సం
కుతుబ్షాలు,నైజాములు
నిర్మించిన నగరం
ఊహలకే అందకుండ
పెరుగుతోంది దినదినం
ప్రణాళికకు భిన్నంగా
అనియంత్రియపు కట్టడాలు
వాన నీరు పార కుండ
అడ్డగించు నిరోధకాలు
అధిక వర్ష సమయాన
కట్టడాల కారణాన
ఇళ్లెన్నో నీట మునగ
జీవనమే అస్థిరం
కలుషితపు కాల్వలన్ని
వర్షాలతో పొంగగా
జీవనమే నరకం
క్షణ క్షణం భయం భయం
రసాయనపు వాగులు
మూసీలో కలువగా
నదీపరిధి ప్రాంతాల్లో
జల మలినం భయానకం
వాన నీరు రహదారుల
చెదారముతో కలువగా
నాసిరకపు బాటలతో
పయనమాయె నరకం
స్వచ్ఛత, ప్రణాళికకు
జనవాహిని సహకరింప
విశ్వనగర జాబితాలో
చేరుతుంది నగరం..
- కిడాంబి శేషాద్రి
Advertisement