ఏమి పుణ్యము చేసేనో శబరి
తాను రుచి చూసిన పండు
శ్రీ రామునకు తినిపింపగ
ఏమి పుణ్యము చేసెనో కన్నడు
తన కన్ను పెరికి
శివుని కతికించిగ
ఏమి పుణ్యము చేసేనో బలి
వామనుడికి
మూడడుగుల దానమివ్వగ
ఏమి పుణ్యము చెసెనో కుచేలుడు
శ్రీ కృష్ణునకు
గుప్పెడు అటుకులు సమర్పించగ
ఏమి పుణ్యము చేసెనో వుడుత
శ్రీ రామ సేతువుకు
ఇసుక సాయ మందించగ
ఏమి పుణ్యము చేసెనో ఎలుక
గజాననుని వాహనమై
సర్వ జనుల పూజ లందుకొనగ
కొంచమైన చాలు నిర్మల భక్తి
నీరజాక్షుని కదియే బహు ప్రీతి
నిస్సంశయముగ నిచ్చు
భవ సాగర విముక్తి
-డా. కేతవరపు రాజ్యశ్రీ
Advertisement