ఆఖరి ఆడుగా!

Advertisement
Update:2023-05-29 15:04 IST

ఆఖరి ఆడుగా!

మౌనం మాట్లాడింది

ఆవేదన అక్షర మయింది

ఆత్మ ఘోషిస్తోంది ఆకాశమై

శరీరంలో రక్తం అనే సిరా ఇంకిపోయింది

చేతిలో కలం బాకైంది

ఆశలు ఆశయాలు కుప్పకూలిపోయాయి

కడకు కట్టే శ్మశానంలో కాలి బూడిదయ్యింది

జననమరణాలు -చావుపుట్టుకలు

ఒకదానికొకటి పర్యాయపదాలే కావచ్చు

అంతా మిథ్య అని తేలిపోయింది

మమకారాలు కనుమరుగై పోతున్నాయి

మంచితనం తలఎగరేసి తిరగలేకపోతోంది

మానవత్వం తలవాల్చేసింది

పండితుడుకూడా పాదాభివందనం చేస్తున్నాడు

అధికారం వున్న పామరుడికి

రోగ వాయువు కరాళ నృత్యం చేస్తోంది

గోడలు అడ్డుగావున్నా

వదినా! అక్కా! అంటూ

ఇరుగమ్మ పొరుగమ్మ ఒకప్పుడు

పలకరించేవారు

నేడు కనిపిస్తే ఎక్కడ పలకరించాలో అని

తలుపులు కిటికీలతో సహా ఇప్పుడు అన్నీ బంద్

దేవుడా !

ఇదా నీ సృష్టి రహస్యం

కలియుగాంతానికీ ఇదేనా ఆఖరి అడుగు

-కమల ఉండవల్లి (గుంటూరు)

Tags:    
Advertisement

Similar News