నర్తకుని నాట్యాలు
గాయకుని గానాలు
వాదకుని వాద్యాలు
శిల్పకుని శిల్పాలు
చిత్రకుని చిత్రాలు
అంగనల అందాలు
కందర్పు కయ్యాలు
కవిరాజు కావ్యాలు
కర్షకా నీ కర్రు కదిలినన్నాళ్లే.
డాంభికుని తత్వాలు మాంత్రికుని మంత్రాలు తాంత్రికుని తంత్రాలు గురువుల గోప్యాలు గుడుగుడు గుంచాలు దేవుళ్ళ తిరునాళ్ళు
దివ్యనది తీర్ధాలు
కర్షకా! నీ కర్రు కదిలినన్నాళ్ళే.
ధార్మికుని దానాలు పండితుని భాష్యాలు
జ్యోతిషుని జోశ్యాలు
తార్కికునితర్కాలు
వర్తకుని వాజ్యాలు
వకీళ్ల వాదాలు
సైనికుని శౌర్యాలు యాంత్రికుని యంత్రాలు
యోధుల యుద్ధాలు
రాజుల రాజ్యాలు
కర్షకా! నీ కర్రు కదిలినన్నాళ్ళే.
(కాళోజీ 'నా గొడవ' నుండి.)
Advertisement