ఉషోదయపు వేళ
మంచుతెరలు కమ్మిన సమయాన
చిరుగాలి ఎదురొచ్చిమరీ పలకరిస్తుంది!
అటుఇటు నిలబడి చూస్తున్న
తరులతలు స్వాగతగీతాలు ఆలపిస్తాయి!
ఆ దారిలో వెళ్తున్న ప్రతిసారి
చెట్ల మధ్య నుండీ
నిశ్శబ్దం గా గమనిస్తూ
అప్పుడప్పుడు తమ ఉనికిని
తెలియ జేస్తాయి పక్షులు
తమ తీయని కిలకిలా రావాలతో
ప్రకృతిలోకి అడుగులు వేసిన ప్రతిసారీ
కొత్తగానే ఉంటుంది నాకు!
ఆత్మీయ అనురాగాలు
నింపుకున్నట్టు అనిపిస్తుంది!
మంచుతడిసిన మందారాలు
బద్దకంగా తలలూపు తున్నాయి
తూరుపున అరుణ కాంతి నిండుతూంది
ఆదిత్యుని రాకను గమనించి
స్వాగతం పలుకుతూ
చలిగా ఉన్నా
ఉషోదయపు వేళ
ఏకాంతంలో ప్రకృతి ని
ఆస్వాదించడం
ఓ మధురానుభూతి!
- కళ్ళే వెంకటేశ్వర శాస్త్రి
Advertisement