మనసు
మాట్లాడ్దం మానేసింది
ఊపిరిలోనూ
చైతన్య సమీరం లేదు
ఇంటి ముంగిట్లోనే
ఎదురవుతాయి
రకరకాల కృత్రిమ ముఖాలు
అమ్మ మమ్మీ గా
నాన్న డాడీగా మారి
ఆ పిలుపుల్లో
మాధుర్యం ఇంకి పోయింది
పెదాలకు నాలుకకు
తీరిక లేదు
విరామం లేదు
చెవులకు
భావ శూన్య శబ్దాలతో
చిల్లులు పడ్డాయి
చిట్టి వేళ్ళు కంప్యూటర్ నొక్కుతున్నాయి
మాటల్లేని సందేశాలు
మూగ భాషలతో
క్షణం తీరికలేదు
ఆత్మీయుల కలయికలు
పలకరింపులు
కరచాలనలు
కౌగిలింతలు
అన్నీ అసహజంగానే
కర్త కర్మ క్రియ తనే అయినప్పుడు
మిగిలేది తనొక్కడే
ఎవరు మార్చాలి దీన్ని
నీవా నేనా
మనమా
-కళ్ళే వెంకటేశ్వర శాస్త్రి
(బెంగళూర్)
Advertisement