విమల సాహితీ సమితి - పాలపిట్ట సంయుక్త ఆధ్వర్యంలో జాషువా స్మారక కవితల పోటీ
అమానుషమైన అంటరానితనాన్ని, అవమానాల్ని ఎదిరించి తెలుగు కవితా ప్రపంచం మీద తనదైన ముద్ర వేసిన సామాజిక విప్లవ కవితామూర్తి, నవయుగ కవితా చక్రవర్తి గుర్రం జాషువా.
అమానుషమైన అంటరానితనాన్ని, అవమానాల్ని ఎదిరించి తెలుగు కవితా ప్రపంచం మీద తనదైన ముద్ర వేసిన సామాజిక విప్లవ కవితామూర్తి, నవయుగ కవితా చక్రవర్తి గుర్రం జాషువా. కులవివక్షకు వ్యతిరేకంగా తన జీవితకాలమంతా పోరాడిన జాషువా కవితాదీప్తి ప్రతి తరాన్ని ఉద్దీపింపజేసే స్ఫూర్తి. ''కవిని గన్నతల్లి గర్భంబు ధన్యంబు, కృతుడు జెందువాడు మృతుడు గాడు'' అంటూ కవితాశక్తిని లోకానికి తెలియజెప్పిన కవీశ్వరుడు. అన్ని రకాల పెత్తనాలనీ ప్రతిఘటించే కవిత్వాన్ని సృజించి అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన విశ్వనరుడు జాషువా. ''రాజు జీవించు రాతి విగ్రహములందు, సుకవి జీవించు ప్రజల నాలుకల యందు'' అని పలికిన జాషువాని స్మరించుకుంటూ కవితల పోటీ నిర్వహించాలని విమల సాహితీ సమితి-పాలపిట్ట సంకల్పించాయి. పోటీలో పాల్గొనవలసిందిగా కవులకు ఇదే మా ఆహ్వానం.
మొదటి బహుమతి: రూ. 3000
రెండో బహుమతి: రూ. 2000
మూడో బహుమతి: రూ. 1000
పది కవితలకు ప్రత్యేక బహుమతులు
(ఒక్కొక్క కవితకు రూ. 500)
- సమాజంలోని సకలవివక్షల్ని వ్యతిరేకించే అంశాలు ఏవైనా ఇతివృత్తాలుగా తీసుకోవచ్చు.
- అన్నిరకాల ఆధిపత్యాల్ని నిరసించే లక్ష్యం, పీడిత వర్గాల్లో ఆత్మగౌరవ చైతన్యాన్ని ప్రోది చేయడం కవిత్వసృజనలో కీలకం.
- పోటీకి పంపించే కవితలు ఎక్కడా ప్రచురితం, ప్రసారమై ఉండకూడదు. సోషల్ మీడియాలో పోస్టు చేసి వుండకూడదు.
- పోటీలో బహుమతులు గెలుచుకున్న కవితలనీ, సాధారణ ప్రచురణ కింద ఎంపికయిన కవితలని పాలపిట్ట పత్రికలో ప్రచురిస్తాం.
కవితలు పోస్టులో పంపవచ్చు లేదా ఈమెయిల్ చేయవచ్చు.
మీ కవితలు చేరడానికి చివరి తేదీ: 31 అక్టోబర్ 2022
కవితలు పంపాల్సిన చిరునామా:
ఎడిటర్, పాలపిట్ట
ఫ్లాట్ నెం: 2, బ్లాక్-6, ఎం.ఐ.జి-2, ఏపిహెచ్‌బి
బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్-500044
palapittamag@gmail.com
PH: 9490099327