కోరింది పొందడం
__________
ఇద్దరు పిల్లలు మాటాడుకుంటున్నారు. ఒకడు రెండవ వాడితో అన్నాడుగదా!...‘నీ రహస్యం నాకు తెలిసిపోయింది’ అనడం ద్వారా అవతలి వారినుంచి కావలసింది పొందవచ్చు’ అని.
రెండోవాడు ఎగిరి గంతేసి, తండ్రి దగ్గరకు వెళ్లి- ‘‘నాన్నా! నీ రహస్యం నాకు తెలిసిపోయింది’’ అన్నాడు.
‘‘ఎవరికీ చెప్పకు సుమా! ఇవిగో పది రూపాయలు తీసుకో’’ అని తండ్రి డబ్బిచ్చాడు.
కొడుకు ఎగిరి గంతేసి- తల్లిదగ్గరకెళ్లి ‘‘అమ్మా! నీ రహస్యం నాకు తెలిసిపోయింది అన్నాడు.
‘‘కానీ ఎవరికీ చెప్పకేం! ఇదిగో ఈ పదీ వుంచు’’అని తల్లి డబ్బులిచ్చింది.
‘ఇదేదో బావుందే’అని- ఇంటికొచ్చిన పోస్ట్‌మ్యాన్‌తో- ‘‘నాకు నీ రహస్యం తెలిసిపోయింది’’ అన్నాడు.
‘‘ఔనా! కన్నా! అయితే ఈ నాన్న దగ్గరకొచ్చి ఓ ముద్దిచ్చేయ్ మరి’’ అన్నాడు పోస్ట్‌మాన్ చేతులు చాస్తూ.
**
ఫలితం
________
సైంటిస్టులు దొంగలనుపట్టుకునే యంత్రాన్ని కనిపెట్టారు. కెనడాలో ఆ యంత్రం 30 నిముషాల్లో ‘పది మంది’ దొంగలను పట్టేసింది! అమెరికాలో పదిహేను నిముషాల్లో అదే యంత్రం ‘అయిదుగురు’ దొంగల్ని పట్టింది. మూడేమూడు నిముషాల్లో మన దేశంలో దొంగలు దాన్ని దొంగిలించి పట్టుకుపోయారు.
**
వయస్సు
___________________
‘‘నీ వయస్సెంత’’ అడిగాడు బుడుగు డుంబుని.
‘‘ఊఁ... ఏడేళ్లు.’’
‘‘నీకు తెలుసా? నీ వయస్సులో వున్నప్పుడు, నాకూ ఏడేళ్లే!’’
**
ఎనిమిదిలో సగం
__________________
టీచర్: ఎనిమిదిలో సగం ఎంత సుమిరా?
సుమిర: అడ్డంగానా, నిలువుగానా టీచర్?
టీచర్: అదేంటి?
సుమిర: అవును టీచర్! 8 అడ్డంగా అయితే సున్న. నిలువుగా అయితే మూడు.
**
పలుకు
____________________
సూర్యనారాయణ ప్రభను తీసుకుని బార్‌కు వెళ్లాడు. ‘‘ఐ లవ్‌యూ’’ అన్నాడు.
ప్రభ ‘‘ఏమిటి నువ్వే ఈమాట అంటున్నది? లేక బీరు అంటోందా’’ అడిగింది నివ్వెరపడి.
‘‘నేనే అంటున్నాను! ఎటొచ్చీ ఆ బీర్ సీసాతో అంటున్నాను’’ అన్నాడు సూర్యనారాయణ తాపీగా!
**
సైలెంట్ మోడ్
____________________
‘‘సెల్ ఫోన్‌కూ; గర్ల్‌ఫ్రెండ్‌కు తేడా ఏమిటంటావ్?’’ అడిగాడు పార్వతీశం సుందర సాయిని.
‘‘సెల్‌ఫోన్ అయితే ‘సైలెంట్ మోడ్’లో పెట్టవచ్చు! గర్ల్‌ఫ్రెండ్‌ని పెట్టలేం కదా!’’ అన్నాడు సాయి.
**
ఛాన్స్
____________________
విదేశంలో వున్న బాబూరావ్‌కు టెలిగ్రాం వచ్చింది ‘‘్భర్య చనిపోయింది. దహనం చేయమంటారా? పాతిపెట్టమంటారా’’ అంటూ
వెంటనే సమాధానంపంపాడిలా- ‘‘ఎలాంటి ఛాన్స్ తీసుకోవద్దు! ముందు కాల్చేసి, ఆ తరవాత బూడిదను పాతిపెట్టండి’’ అని.
**
ప్రశ్నలు- జవాబులు
______________________
ప్రశ్న: ‘కాకతాళీయం’ అన్న దానికి ఉదాహరణ చెబుతావా?
జవాబు: మా అమ్మా, నాన్న ఒకేరోజు, ఒకే సమయానికి పెళ్లిచేసుకున్నారు!
**
ప్రశ్న: ఆ అబ్బాయి అమ్మాయితో ‘‘నీ చెయ్యి పట్టుకోవా’’అని అడిగితే ఆమె ఏమంది?
జవాబు: ‘‘నా చెయ్యి నాకు బరువేం కాదు! నువ్వెందుకు పట్టుకోవడం’’ అంది.,
**
ప్రశ్న: ఒక స్ర్తికి సాధారణంగా పురుటినొప్పులు ఎంతలా వుంటాయి?
జవాబు: ఆమె చెప్పేదాన్ని, రెండు చేత భాగాహారించేంత.
**
ప్రశ్న: నీ దగ్గర రెండు సిగరెట్లున్నాయి. కానీ అగ్గిపెట్టె లేదు. సిగరెట్టు కాల్చాలంటే ఏం చేస్తావ్!
జవాబు: ఒక సిగరెట్టును తీసి దానిని చాలాసేపు పొగుడుతాను. దాంతో రెండోది ‘మండుతుంది’ అప్పుడు దాన్ని కాలుస్తా!
**
ప్రశ్న: దట్టమైన ఆకులున్న చెట్టులా, నీ జుట్టు భలే వుంటుంది! ‘హెయిర్ కట్’ ఎప్పుడు చేయిస్తూంటావ్?
జవాబు: చేయించను. ‘ఆకురాలు కాలంలో’ అవే రాలిపోతాయి.