గురుదేవోభవ (కవిత)

Advertisement
Update:2022-12-19 12:06 IST

గురుదేవోభవ (కవిత)

గుండెను గుడిగచేసి

రుధిరమ్మును తైలమ్ముగ చేసి

అజ్ఞానాoధకారములు తొలగించి, జ్ఞాన దీప్తులు వెలిగించు వాడు గురువు.

జీవనమును సుఖజీవనము చేయునేర్పును నేర్పువాడు గురువు.

బ్రహ్మ,విష్ణు,మహేశ్వర

స్వరూపి గురువు,

భక్తి ,జ్ఞాన, వైరాగ్యం

నేర్పువాడు గురువు,

ఇన్ని నేర్పిన గురువు

నేడు

నీడలేని వాడవుతు న్నాడు

గూడు చెదిరిన వాడిలాగా,

గుండె బరువు చేసుకొంటున్నాడు.

ఆచార్య దేవోభవ

ఆది అప్పటి నానుడి

శిష్యదేవోభవ

ఇది ఈనాటి నానుడి./

శిష్యుడు చదువు'కొంటు'న్నాడు.

'చదు'నమ్మలేక గురువు

బడిగుడిలో గండశిలైపోతున్నాడు,

కరోనా మహిమో కలికాలమో

చదువు అంతర్జాలంలో మాయాజాలం ఐపోయింది.

యంత్రాల మధ్య మిధ్యయిoది.

విద్యా వ్యాపారమైనప్పుడు ,

సంస్కారాన్నికొనగలిగే ధనం

ఎక్కడ దొరకుతుంది?

కానీ.

ఒక్క నమ్మకం మూఢుడిని

పండితుణ్ణి చేస్తుంది,

కూలిన గోడల్లో,

ఆకలి కడుపుల్లో కూడా విద్యాసుమాలు

వికసిoప చేస్తుంది.

కన్నీళ్లని కూడా

పన్నీరుగా మారుస్తుంది.

అంధుడికి కూడా లోకాన్ని చూపిస్తుంది.

బధిరుడికి సంగీతాన్ని వినిపింప.చేస్తుంది.

కుంటివాడినికూడా నడిపిస్తుంది,

ఈలోకాన్ని మార్చి కొత్తలోకానికి

బాటలు వేస్తుంది.

విద్యార్థికి శిక్షణ,క్రమశిక్షణ నేర్పండి

గురువుకి గౌరవం పెంచండి,

రాయి రాముడై లోకాన్ని ఏలుతుంది

- జి .ఎల్ .ఎన్. శాస్త్రి

Tags:    
Advertisement

Similar News