అంతే బాధలోంచి

Advertisement
Update:2023-08-30 11:38 IST

నమ్మకం చిట్లిన చోట

కన్నీటి బోట్లను కుట్టుకుంటూ

ఆశల పడవను నడుపుతున్నాను .

గాయపడిన అనుభవాలలోంచి

కొత్త పాఠాలు నేర్చుకుంటున్నాను .

కొంత ప్రయాణానికి

నిజాలు తేలియాడినపుడు

వ్యూహాలు పదును తేరాలి.

కాలాన్ని ఎదురీదడమంటే

మార్పులను అవగతం చేసుకోవటమే .

దారులు ఇరుకవుతున్నప్పుడు

ఆలోచనలు పదునెక్కాలి.

ఒక్కోదానికి ఒక్కో హద్దు గీసి

అనంత విశ్వాన్ని గుండెల్లోంచి తీసి

అనేకానేకాలుగా దర్శించాలి .

చీమ బలం చూసి

కన్నులెగరేసి

ఆకాశాన్ని ఎత్తగలం

ఆకాశం పైకి ఎక్కగలం.

లక్ష్యం కుదుపుతున్నపుడు

రహ దారులు ఇట్టే చిగురిస్తాయి .

ఊహకు రూపం ఇవ్వడమంటే

కొన్ని కన్నీటి మెట్లు ఎక్కటమే .

ఇప్పుడు అంతే బాధలోంచి లేచి

తీరాలకి చేరి

ఇక సమీరాలు అందివ్వాల్సిన సందర్భంలోంచి

చినుకుల్లా కురిసిన ఒక నేను .

-గవిడి శ్రీనివాస్

Tags:    
Advertisement

Similar News