ఒక్క వాలు చూపు
విసిరేసి పోయావు
నీదేం పోయింది?
పోయిందంతా నాదే ..!
ఒక్క చిరునవ్వు
పడేసి పోయావు
నీదేం పోయింది?
పోయిందంతా నాదే..!
ఒక్క పలుకుతో
తేనె ఒలికించి వెళ్ళావు
నీదేం పోయింది..?
ఒక్క భంగిమతో
నన్ను అవాక్కయేలా చేశావు
నీదేం పోయింది?
ఒక్క స్పర్శతో
నన్ను పులకింప జేశావు
నీదేం పోయిందో
తెలియదు గానీ
నాకైతే పోయిందంతా
తిరిగొచ్చింది..!
-జి రంగబాబు
(అనకాపల్లి)
Advertisement