ఆడిట్ (కవిత)

Advertisement
Update:2023-05-26 16:27 IST

నాలోంచి అప్పుడప్పుడూ

ఓ ఆకారం దూసుకు వస్తుంది

ఉధృతమైన కెరటంలా!

నాకు తెలియకుండా

నా ప్రయాణాన్ని నరకం చేస్తుంది.

నాలో నేను రగులుతూ కాస్తంత విరామానికి

దగ్గరయినప్పుడు నా ముందు కూర్చొని

అదే నవ్వు రకరకాలుగా ... వికృతంగా

జీవితం చేదుగా జడంగా వున్నా

దేనికీ తలుపులు మూయక

భయాన్నీ, చీకటినీ త్రోక్కేసే

దాటలేని భయస్తుణ్ణి నేను.

నిజం చేసుకోవాల్సిన

కలలన్నీ మిగిలే వున్నాయి.

ఆశల తెరచాపల్ని ఎత్తిన ఓడలు

శివారు హద్దుల్లో ప్రయాణం చేస్తున్నాయి

నాతో పాటు రా!

జీవితాన్ని ఆడిట్ చేసుకొందాం.

ఒక్క క్షణమైనా నా పక్కన నుంచో!

దక్కించుకోవల్సినవి

చాలానే వున్నాయి

దక్కించుకొని లెక్కించుకొందాం.

చరిత్రలో ఎప్పుడూ

ప్రజలే విజయ సంతకం చేస్తారు.

-ఏటూరి నాగేంద్రరావు

Tags:    
Advertisement

Similar News