డా. వాసా ప్రభావతి స్మారక కవితల పోటీ

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలయిన సందర్భంగా అమృతోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో దేశభక్తి -పురోగతి - జాతీయత ప్రధానాంశాలుగా కవితల పోటీ నిర్వహించాలని పాలపిట్ట-వాసా ఫౌండేషన్‌ సంకల్పించాయి.

Advertisement
Update:2023-04-01 07:58 IST

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలయిన సందర్భంగా అమృతోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో దేశభక్తి -పురోగతి - జాతీయత ప్రధానాంశాలుగా కవితల పోటీ నిర్వహించాలని పాలపిట్ట-వాసా ఫౌండేషన్‌ సంకల్పించాయి. సుప్రసిద్ధ సాహితీవేత్త డా. వాసా ప్రభావతి సంస్మరణార్థం నిర్వహించ తలపెట్టిన కవితల పోటీకి అమృతోత్సవాల సందర్భమే ప్రధాన వస్తువు. మనం సాధించిన స్వాతంత్య్రం, స్వతంత్ర సమరయోధుల స్వప్నాల సాఫల్య వైఫల్యాలు, దేశప్రగతిలో మనం సాధించిందీ ఏమిటో, సాధించాల్సిందీ ఏమిటో చెప్పే కవితాంశాల్ని ఎంచుకోవాలి. కనుక 15 ఆగస్టు 2022న ప్రారంభించి ఏడాది పొడుగునా నిర్వహిస్తున్న అమృతోత్సవాల స్ఫూర్తిని ప్రతిఫలించేందుకు అనువుగా ఈ కవితల పోటీ ఉంటుంది. దేశభక్తి, జాతీయత కీలకభూమికగా తలపెట్టిన పోటీకి తమ కవితల్ని పంపించాల్సిందిగా కవులని కోరుతున్నాం.

మొదటి బహుమతి: రూ. 3000

రెండో బహుమతి: రూ. 2000

మూడో బహుమతి: రూ. 1000

ఎనిమిది కవితలకు ప్రత్యేక బహుమతులు

(ఒక్కొక్క కవితకు రూ. 500)

- దేశభక్తిని పెంపొందించే అంశాలకు ప్రాధాన్యం

- కుల, మతాల విభేదాలని మరచి శాంతి సామరస్యాలతో ప్రజలంతా పురోగామిపథంలో ప్రయాణించాలన్న భావనలకు బలం చేకూరే అంశాలు వస్తువుగా ఉండటం ఉపయుక్తం.

- వస్తుశిల్పాల మధ్య సమన్వయం ఉండాలి. బలమైన అభివ్యక్తి గల కవితలకే పోటీలో ప్రాముఖ్యం ఉంటుంది.

- కవితల నిడివికి సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవు. అయితే దీర్ఘకవితలు పోటీకి పరిశీలింపబడవు. వచనకవితలు ఎన్ని లైన్లయినా ఉండొచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయం పరిపూర్ణంగా కవితలో వ్యక్తమయినదో లేదో పరిశీలించుకుని పంపించండి.

- కవితలు తిప్పి పంపడం సాధ్యం కాదు. కనుక ఒక కాపీని మీ వద్ద ఉంచుకోండి. ఎవరయినా ఒకటి లేదా రెండు కవితలు మాత్రమే పోటీకి పంపించాలి.

- కవితలు ఈమెయిల్‌ చేయండి లేదా పోస్టు చేయండి.

- మీ పేరు, చిరునామా విడిగా రాయండి. కవితతోపాటు మీ అడ్రసు ఉండాలి.

- పోటీకి పంపించే కవితలు ఎక్కడా ప్రచురితం, ప్రసారమై ఉండ కూడదు. సోషల్‌మీడియాలో పోస్టు చేసి వుండకూడదు.

- పోటీలో బహుమతులు గెలుచుకున్న కవితలనీ, సాధారణ ప్రచురణ కింది ఎంపికయిన కవితలని పాలపిట్ట పత్రికలో ప్రచురిస్తాం.

- పోటీకి వచ్చే కవితల ఎంపికలో పాలపిట్ట-వాసా ఫౌండేషన్‌ నియమించే న్యాయనిర్ణేతల బృందానిదే తుది నిర్ణయం. దీనిపై ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ, వాదవివాదాలకీ తావు లేదు.

మాకు కవితలు పంపించడానికి చివరి తేదీ: 30 ఏప్రిల్‌ 2023

కవితలు పంపించాల్సిన చిరునామా:

ఎడిటర్‌, పాలపిట్ట

ఫ్లాట్‌ నెం: 2, బ్లాక్‌-6, ఎం.ఐ.జి-2, ఏపిహెచ్‌బి

బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌-500 044

ఫోను: 9490099327

palapittamag@gmail.com

Tags:    
Advertisement

Similar News