తిరువూరులో ఘనంగా డాక్టర్ ఎస్.ఆర్.రంగనాథన్ జయంతి

డాక్టర్ ఎస్.ఆర్.రంగనాథన్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని గ్రంథాలయానికి ఒక శాస్త్రాన్ని రూపొందించారన్నారు.

Advertisement
Update:2022-08-12 17:23 IST

ప్రతి మనిషి ఉన్నత స్థితికి ఎదగాలి అంటే పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్.ఆర్.రంగనాథన్ జయంతి కార్యక్రమం శుక్రవారం తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి లైబ్రేరియన్ డాక్టర్ కె.కుసుమ కుమారి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రిన్సిపాల్ డాక్టర్ సుశీలరావు మాట్లాడుతూ పుస్తకాలు లేకపోతే మనిషి ఎగుదల నామమాత్రంగా ఉంటుందని, నిత్యం పుస్తకాలతో ఉండే వ్యక్తి భవిష్యత్తు ఉన్నత శిఖరాలు అధిరోహించేలా ఉంటుంద‌ని ఆయన తెలిపారు. ఒక్కసారి చరిత్రను పరిశీలిస్తే ఉన్నత స్థితికి చేరిన ప్రతి ఒక్కరు పుస్తకాలతో సాన్నిహిత్యంగా ఉండేవారని అర్థం అవుతుందని సుశీలరావు తెలిపారు. పుస్తకాలు మనిషి మనోవికాసానికి, ఉన్నత స్థితికి చేరడానికి ఉపయోగపడతాయని ఆయన సూచించారు.

మరో ముఖ్య అతిథి అబూబకర్ మాట్లాడుతూ గ్రంథాలయాలకు ఒక శాస్త్ర ఉంటుందని, గ్రంథాలయాలు మనిషి జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని నిరూపించిన వ్యక్తి డాక్టర్ ఎస్ఆర్ రంగనాథ న్ అని పేర్కొన్నారు. ఎస్ఆర్ రంగనాథన్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని గ్రంథాలయానికి ఒక శాస్త్రాన్ని రూపొందించారన్నారు. హిందీ అధ్యాపకులు రఘురామ్ ప్రసాద్ మాట్లాడుతూ గ్రంథాలయాలు సమాజంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని, ప్రతి మనిషి జీవితంలో గ్రంథాలయాల పాత్ర ప్రముఖంగా ఉంటుందని నిరూపించిన వ్యక్తి డాక్టర్ ఎస్ఆర్ రంగనాథం అని ఆయనను స్మరించుకున్నారు. ఈ సందర్భంగారంగనాథన్ జీవితంలో జరిగినఅనేక అంశాలను ఉదహరించారు .

కళాశాల గ్రంథ పాలకురాలు డాక్టర్ కుసుమ కుమారి మాట్లాడుతూ ప్రతి మనిషి ఉన్నత స్థితికి చేరే విషయంలో గ్రంథాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. అనేక మంది ప్రముఖుల జీవిత చరిత్రలు పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందని ఉదహరించారు. డాక్టర్ రంగనాథ్ లేకపోయి ఉంటే గ్రంథాలయాల మనుగడ ఉండేది కాదని, ఈ రోజు మనిషి జీవితంలో ఎంత పురోభివృద్ధి సాధ్యమయ్యేది కాదని పేర్కొన్నారు. డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్‌ తన జీవితకాలాన్ని గ్రంథాలయాల అభివృద్ధికి, శాస్త్ర పురోభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పలువురు పాల్గొన్నారు

Tags:    
Advertisement

Similar News