తంతు...!!

Advertisement
Update:2023-08-05 16:25 IST

భాగ్య నగరంలో ,

బ్రతికేవాళ్లంతా -

భాగ్యవంతులుకాదు !

భాగ్యవంతులందరూ

భాగ్యనగరం లో

ఉండాలని లేదు !

ఋతువులకు

రాజు -పేద

తేడాయేమి తెలుసు ?

వర్షాకాలం మాత్రం

తరతమ భేదంలేకుండా

నిండుకుండ

ఒకేసారి బోర్లించినట్టు

వర్షిస్తుంది! ..

భాగ్యవంతులు ఎలానూ

భవనాల్లో

సురక్షితంగా ఉంటారు!

పేదోల్ల సంగతి

చెప్పేదేముంది ...

వాళ్ల గుడిసెల్లోకి

వర్షపునీరు

వరదలై

గృహప్రవేశం చేస్తుంది '

రాజకీయం ఎప్పటిలానే

పడవల్లో ఫోటోలుదిగి

వార్తాపత్రికల్లో

పతాకశీర్షిక అవుతుంది !

భాగ్యనగరంలోని

అభాగ్యులు అంతా ...

ప్రతిసంవత్సరం

ఈ తంతు ----

వింతగా ,

గమనిస్తూనే ఉంటారు!!

-డా.కె.ఎల్.వి.ప్రసాద్.

సికింద్రాబాద్ (హన్మకొండ ).

Tags:    
Advertisement

Similar News