మారిపోతున్నాడుసుమా
మనిషి .....!
కాదు ..కాదు ..
మారిపోయాడు సుమా,
మనిషి .....!
స్వార్ధమే -
సర్వస్వమనుకుని ,
ధనార్జనే ...
జీవితధ్యేయమనుకుని
గిరిగీసుకుంటున్నాడు
మనిషి....!
తనకుతాను
వంటరైపోతున్నాడు
మనిషి .....!
బంధుత్వాలు....
రక్తసంబంధాలు...
అనురాగాలు--
ఆప్యాయతలు...
వాణిజ్య సంబంధాలుగా
మార్చి వేస్తున్నాడు
మనిషి....సర్వం,
డబ్బుకే ముడిపెడుతున్నాడు
మనిషి ........!
సుఖాలమాటున
కష్టపడడం మాని,
కష్టపడటం వెనుక
సుఖమున్నదని మరచి
మారిపోయాడు సుమా
మనిషి ....!
మారిపోతున్నాడు సుమా
మనిషి ...!!
-డా.కె.ఎల్.వి.ప్రసాద్.
(హన్మకొండ)
Advertisement