ఆ..పువ్వుకీ
ఆ..నెలకీ ...
ఏదో ....
అవినాభావ-
సంబంధం ఉంది !
ఆనెలలో పుష్పించి
అదేనెలలో వడలిపోయే
ఆ.పువ్వు...
మండుతున్న
అగ్నిగోళంలా
ఎర్రగాగుండ్రంగా
చూడ్డానికి అందంగా
ఆహ్లాదం కలిగిస్తుంది !
యెర్రని ఎండతో
జతకట్టే ఆ ..పుష్పం
ఆనెలలో తప్ప ..
మిగతకాలం
మట్టిదుప్పటి కప్పుకుని
దుంపగా -సుషుప్త -
దశకుచేరి -
నేలలో మిగిలిపొతుంది
సంవత్సరానికోసారి
కళ్లు తెరుస్తుంది ....!
వాసన లేకున్నా ...
పూజకుపనికిరాకున్నా ,
అందంతో అందరిని
ఆకర్షిస్తుంది ....అదే
మే -నెలలో మాత్రమే
పుష్పించే ---
మే ---ఫ్లవర్ .....!
అదే ..' మే -పుష్పం" !!
డా.కె.ఎల్.వి.ప్రసాద్.
(హన్మకొండ)
Advertisement