ఒకప్పుడు
నాగుండె గుప్పెడంత
మనసు మందుబిళ్ళంత
నేను ఆమె. అంతే చాలింది
ఇప్పుడు నాగుండె
గుమ్మడికాయంత.
మనసు ఆకాశమంత
లోతు అరేబియాఅంత
ఎత్తు ఎవరెస్టంత
ఎందుకంటే
కొడుకులు కూతుళ్ళు
వాళ్ళ పిల్లలు ,వాళ్ళవాళ్ళ పిల్లలు
ఇద్దరు ఇరవై అయ్యాం.
మునిమనుమలు
ఇనుమునుమలు
నాలుగోతరం మరి
ఇల్లుఇరుకయ్యేది
అంతా యిక్కడవుంటే-
బయటే
అమెరికా ,కెనడా
ఆస్ట్రేలియా,సింగపూర్.
కొందర్నిచూడలే
అక్కడే పుట్టారు.
రోజూ వాళ్ళతోముచ్చట్లు.
హాయ్,హాల్లో, క్యూట్, వెరీగుడ్
కంగ్రాట్స్,స్మైల్,సూపర్,అంటూ
స్మార్ట్,ఐ ఫోన్స్,టాబ్లెట్లు,
98 ఇంచ్టి.వి.తెరలపై..
మేం వెళ్ళలేం
వాళ్ళు రాలేరు
అయినప్పుడల్లా
స్వంత ఇళ్ళవాళ్ళయ్యారు.
మమ్మల్ని అక్కడకు వచ్చేయమని
ఒకటే గోల.
మాకు ఇది మదర్ లాండ్
వాళ్ళ కదిమనీలాండ్.
ఇది నా కవితైనా
ఇంటింటి కవితైంది.
-డా: కపిల లక్ష్మణరావు (పెంట్లం)
Advertisement