ప్రముఖ కవి,జీవ శాస్త్రవేత్త కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత డా.దేవరాజు మహారాజు సప్తతి వేడుక కొండాపూర్ లోని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ వృద్ధాశ్రమం ఇంద్రజిత్ గుప్తా హాలు లో నిన్న ఆగస్టు 15 మంగళవారం ఉదయం జరిగింది.
77 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకఆవిష్కరణ ఆనంతరం జరిగిన ఈ సభకు వరిష్ట పాత్రికేయులు అగ్రశ్రేణి సంపాదకులు శ్రీ ఎ.బి.కె.ప్రసాద్ అధ్యక్షత వహించగా ,ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంటు సభ్యులు సి.పి.ఐ.పూర్వ జాతీయ ప్రధానకార్యదర్శి శ్రీ సురవరం సుధాకరరెడ్డి సప్తతి సంచికను ఆవిష్కరించారు. శ్రీ డి.హనుమంతరావు ,ప్రహ్లాద్ ,రమేష్ ల సంపాదకత్వంలో సప్తతి సంచిక రూపొందింది.
ప్రముఖ కవి ,సాహితీవేత్త సుధామ ,నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డా.జి.వి.రత్నాకర్ , మానవవికాస వేదిక జాతీయ అధ్యక్షులు శ్రీబి.సాంబశివరావు ఆత్మీయ అతిథులుగా ప్రసంగించారు. ప్రముఖ పాత్రికేయ సంపాదకులు కె.రామచంద్ర మూర్తి ,కవి ప్రసాదమూర్తి ప్రభృతులు దేవరాజు మహారాజుకు శుభాకాంక్షలు తెలిపారు.
డా.దేవరాజుమహారాజు కవిగా ,జీవశాస్త్రవేత్తగా బహుముఖీన ప్రతిభామతియనీ ,హేతువు మూలకందంగా మానవ వికాసంకోసం రచనలు చేస్తున్న వారనీ ,ఇప్పటికే 88 పుస్తకాలను వెలువరించడం అభినందనీయమనీ వక్తలు ప్రశంసించారు
దేవరాజు మహారాజు దంపతులు అతిథులను సత్కరించారు
డా.దేవరాజుమహారాజు,వారి శ్రీమతి కృష్ణవేణి సముచితరీతిని వారి స్పందన తెలియచేసారు.
మేధావులైన వయోధికులు సేదతీరే కేంద్రం అయిన సి.ఆర్.ఫౌండేషన్ లోనే ఈకార్యక్రమం జరగడం విశేషం.