సిరి నడమంత్రముగ లాభించిన
కరి మింగిన వెలగపండగు
విరి వలె పరిమళించాలి వ్యక్తిత్వం
ఝరిలా సాగాలి లక్ష్యసాధనకై జీవనప్రవాహం
దారి చూపాలి పిన్నలకు ఆచరణతో
మారి తన బలహీనతలను
తొలగించుకుని
మరి మరి ఆలోచనలతో గడపక
సరి సరి నడకలు నడవాలి
సరిగమల సంగీతము ఆస్వాదించుచూ
సరిలేరు నీకెవ్వరూ అనిపించుకోవాలి సాధనతో
పరిధిని దాటక బంధములను నిలుపుకొనుచు
గరిమను చాటుకునేలా ఉండాలి ప్రవర్తన
కోరి వచ్చిన వారిని చులకన చేయక
కూరిమితో మెలగాలి కలకాలం
నారి ఔన్నత్యమును కొనియాడుతూ
వారి పట్ల గౌరవముతో నడచుకొనవలె...!
- చంద్రకళ. దీకొండ
(రెడ్మాoడ్ ,ఉత్తర అమెరికా )
Advertisement