భావన : ఏది ముక్తి

Advertisement
Update:2023-10-06 11:57 IST

ముక్తి అంటే విడుదల! దేని నుంచి విడుదల ?? దుఃఖం నుంచి విడుదల !!! మనిషి ఎల్లప్పుడూ ఆనందంగా జీవించాలి. అంటే మనిషి యొక్క శరీరం ఎప్పుడూ, ఎల్లప్పుడూ ఆరోగ్యకరంగా, తేజోవంతంగా ఉండాలి!

అదే విధంగా మనిషి యొక్క మనస్సు ఎప్పుడూ హాయిగా, ఉండాలి. ఇంకా ముందుకుపోతే... మనిషి యొక్క బుద్ధి

ఎప్పుడూ సునిశితంగా, సదా సత్యాన్ని చూపేదిగా ఉండాలి !

ఎప్పుడైతే బుద్ధి సత్యాన్ని చూపించేదిగా ఉండదో, అప్పుడు మనస్సు

మలినమై, అశుభ్రమై అనేక రుగ్మతలను కలిగి ఉంటుంది ! ఎప్పుడైతే

మనస్సు మలినమై, అశుభ్రమై ఉంటుందో, అప్పుడు శరీరం అస్వస్థతలకులోనై, రోగాలకు మూలమై మనకు ఎన్నో దుఃఖాలను కలిగిస్తుంది.

'దుఃఖాల నుంచి విడుదలే ముక్తి!"

రకరకాల దుఃఖాల నుంచి విడుదల కావడమే ముక్తి అంటే !

శారీరక పరమైన రోగాల నుంచి " "విడుదల"! -" ముక్తి",

మానసిక పరమైన రుగ్మతలు, ఒత్తిడులు, ఆందోళనలు, భయాల నుంచి

"విడుదల " ! ముక్తి"

అలాగే " బుద్ధి " యొక్క "మాంద్యం " నుంచి * ముక్తి ", " విడుదల " !

" అసలు నేనెందుకు పుట్టాను ?".

ఈ జీవితం అంటే ఏమిటి ? "

ఇలాంటివన్నీ మనకు ఏ మాత్రం తెలియవు!మన సాధారణ బుద్ధికి అందవు! సత్యం అన్నది బుద్ధికి

అందనప్పుడు మనకు మన జీవితం సొంతం అగమ్యగోచరంగాఉంటుంది! కనుక...బుద్ధిపరమైన మాంద్యం పోవాలి.మానసిక పరమైన రుగ్మతలు పోవాలి.శారీరక పరమైన అస్వస్థతలన్నీ పోవాలి.

ఇవన్నీ శాశ్వతంగా పోవాలి!

ఒకప్పుడు పోయి మరొకప్పుడు ఉంటే అప్పుడు, అక్కడ, దానిని

ముక్తి వచ్చింది అనం!

ఎప్పుడైతే ఈ మూడూ ..తనువు, మనస్సు మరి బుద్ధి.. కూడానూ

పరిశుభ్రమైపోతాయో..... శాశ్వతంగా.. అప్పుడు " మనకు ముక్తి వచ్చింది "

అంటాం. అంతవరకు ముక్తి రాలేదు. అంటే దుఃఖంలో కొట్టుకుంటున్నాం.

మూడు రకాల దుఃఖాల నుంచి విడుదల కావాలి మనం

కపిల మహాముని ఏమన్నాడంటే...

"త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తిః అత్యంత పురుషార్థః"

కామ, అర్థ, ధర్మ మరి మోక్షాలలో నాల్గవ పురుషార్థమైన మోక్షం

అన్నది ఏమిటయ్యా అంటే మూడు రకాల దుఃఖాల నుంచీ పూర్తిగా విడుదల కావటమే.

దీనినే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏమన్నాడంటే..." తమోగుణం నుంచి

ముక్తిని పొందు! రజోగుణం నుంచి కూడా ముక్తి పొందు! సాత్వికగుణం.

నుంచి కూడా ముక్తి పొందు ! నిర్గుణుడివికా ! "

"త్రైగుణ్య విషయా వేదా నిసైగుణ్యో భవార్జున!

""నువ్వు మూడు గుణాలతో కలిసి ఉన్నావు; గుణాతీతుడవుకా ! ఓ

అర్జునా!"ఈ మూడు గుణాల నుంచి విముక్తుడవుకా!

శారీరక పరమైన రుగ్మతలే మరి తమోగుణ దోషాలు !

మానసికపరమైన రుగ్మతలే రజోగుణ దోషాలు !

బుద్ధి పరమైన రుగ్మతలే సాత్వికగుణ దోషాలు !

ఈ మూడు వెరసి సకల దుఃఖాలనూ కలిగిస్తాయి!ఎప్పుడైతే ఈ దోషాలన్నీ తొలగిపోతాయో... అప్పుడు... మనకు

దుఃఖాలు ఉండవు!అప్పుడు... మనం త్రిగుణాతీతులం అవుతాం!.. అప్పుడు... దుఃఖరాహిత్యంవస్తుంది ! ముక్తి పొందుతాం !

మనకు దుఃఖరాహిత్యం కావాలి.

మన శరీరం చక్కగా ఉండాలి. మన మనస్సు ఎప్పుడూ స్వచ్ఛంగా,

ఉండాలి. మన బుద్ధి ఎప్పుడూ సునిశితంగా ఉండాలి.ఇవన్నీ మనకు కావాలి. కనుక ముక్తి అంటే ఈ మూడు రకాల రుగ్మతల నుంచి విముక్తి

పొందడం! దూరం కావడం ! అవి లేకుండా పోవడం శాశ్వతంగా !

అదే ముక్తి 

-బ్రహ్మర్షి పత్రీజీ

Tags:    
Advertisement

Similar News