ఎప్పట్లానే
మనo చెట్లకు నీళ్ళు పోస్తాం
వాళ్ళు ఫలాలు అందుకో చూస్తారు
ఫలాల రుచి నమిలి
ఇలా
అస్త్రాలు వదులుతున్నారు
ఆ మధ్య
హిందుత్వమని నూరిపోసారు
నిన్న ఇండియా - భారత్ తెరపైకి తెచ్చారు
ఇవాళ
సనాతనమంటూ వస్తున్నారు
రేపు ఇంకోటి...
దేశానికి దేశానికి మధ్య అంతరాలు తొలగి పోతుంటే
మనిషికి మనిషికి మధ్య
అడ్డు వేస్తున్నారు
ఈ రోజుల్లో
కళ్ళుంటే సరిపోదు అంధకారాన్ని చూడగలగాలి
చెవులు ఉంటే సరిపోదు నిశబ్దాన్ని వినగలగాలి
చూసిన దాన్ని, విన్నదాన్ని తర్కించి తెలుసుకోగలగాలి
ఈ సనాతనం
అసలు అర్థం గ్రహించగలగాలి
ఇప్పుడు
సందు సందులో
సనాతనం గురించే మాట్లాడుకోవడం
వాళ్ళకు సరదా కావచ్చు
ఏ స్వలాభాపేక్ష లేనిదిగా సనాతనం నీకు కనిపించవచ్చు
అన్నట్లు
స్వాగతమో, తిరస్కరణో మనకంటూ పెగల్చుకునే గొంతుండాలి
పురజనులారా...
పడమటికి
దూరం తక్కువ కదా
అడుగులు జాగ్రత్తగా వేయండి
-బొప్పెన వెంకటేష్