ఆధునిక జీవితం సంక్లిష్టమైంది. సంక్షుభితభరితమైంది. అయినప్పటికీ మనుషులుగా మనమంతా ఒకచోట కలిసి బతకడం తప్పనిసరి. కనుక మన చుట్టుపక్కల ఉన్న వారిలో మానవీయ భావనలని పెంపొందించడం, ఉన్నత సంస్కారాన్ని అలవరచడం సాహిత్యరచనల కర్తవ్యం. దీనిని దృష్టిలో ఉంచుకొని అరిశా సత్యనారాయణ - అరిశా ఆదిలక్ష్మి గార్ల స్మారక కథల పోటీని నిర్వహించాలని సంకల్పించడమైంది. జీవితకాలమంతా సానుకూల భావనలతో, మంచి పక్షాన నిలిచిన ఈ ఇద్దరి జ్ఞాపకాల స్ఫూర్తి ఈ కథల పోటీకి ప్రేరణ. పాఠకులలో ఉదాత్త సంస్కారం పాదుకోడానికి తోడ్పడే కథారచనని ప్రోత్సహించాలన్నదే ఈ పోటీ ఉద్దేశం. ఈ పోటీలో పాల్గొనవలసిందిగా కథకులని ఆహ్వానిస్తున్నాం.
బహుమతులు
మొదటి బహుమతిః రూ. 7000
రెండో బహుమతిః రూ. 5000
మూడో బహుమతిః రూ. 3000
అయిదు ప్రత్యేక బహుమతులు
ఒక్కొక్క కథకి రూ. 1000
నిబంధనలు:
- మనిషి జీవితం అనేక అనుభవాల సమ్మేళనం కనుక ఎలాంటి ఇతివృత్తం ఎంచుకోవాలో కథకుల నిర్ణయానికి వదిలేస్తున్నాం. జీవితం పట్ల మమకారాన్ని ప్రోది చేసే కథావస్తువు ఏదైనా పరవాలేదు.
- వస్తువుతో పాటు శిల్పం ఈ పోటీలో ప్రముఖంగా పరిగణనలోకి తీసుకునే అంశం. ఇతివృత్తాన్ని ఎంత సుందరంగా, రమణీయంగా, పఠిత మనసుని ఆకట్టుకునేలా సృజించారన్నదే ప్రధానం.
- ఈ కథల పోటికి ఎలాంటి పేజీల పరిమితి లేదు. తాము చెప్పదలచుకున్న కథని ఎన్ని పేజీలలో చెబుతారనేది కథకుల సృజనాత్మక స్వేచ్ఛకు సంబంధించిన అంశం. కనుకనే పేజీల పరిధులు, పరిమితులేమీ లేవు.
- పోటీకి పంపించే కథలు సొంత కథలయి ఉండాలి. అనువాదాలు కాదు. అలాగే ఇదివరలో ఎక్కడా ప్రచురితం, ప్రసారితం కాకూడదు. సోషల్ మీడియాలోగానీ, ఇతర వెబ్‌సైట్లలో గానీ ప్రచురితమై ఉండరాదు. ఈమేరకు కథతోపాటు హామీపత్రం పంపించాలి.
- కవర్ మీద అరిశా సత్యనారాయణ, అరిశా ఆదిలక్ష్మమ్మ గార్ల స్మారక కథల పోటీకి అని రాయాలి. పోటీ నిమిత్తం పంపించే కథలు తిప్పి పంపడం సాధ్యం కాదు.
- కథల ఎంపిక విషయంలో పాలపిట్ట సంపాదకవర్గానిదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఎలాంటి వాదవివాదాలకు, సంప్రదింపులకు తావు లేదు.
- ఈ పోటీలో ఎంపిక చేసే కథలని పాలపిట్టలో ప్రచురించడంతోపాటు భవిష్యత్తులో తీసుకురానున్న కథల సంకలనాలలోనూ ముద్రిస్తాం.
మీ కథలు చేరడానికి చివరితేదీ - 30 ఏప్రిల్ 2023
పోటీ ఫలితాలను ప్రకటించే తేదీ ` 25 మే 2023
మీ కథలని పోస్టు చేయవచ్చు లేదా మెయిల్‌లోనూ పంపవచ్చు.
చిరునామాః ఎడిటర్, పాలపిట్ట
ఎఫ్-2, బ్లాక్ -6, ఏపిహెచ్‌బి
బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్-500044
ఫోనుః 9490099327
email: palapittamag@gmail.com