పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతీ ఏడాది వివిధ రంగాల్లో విశిష్ట కృషి చేసిన 45 మంది ప్రముఖులను 'కీర్తి పురస్కారా'లతో సత్కరిస్తోంది. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుఆచార్య తంగెడ కిషన్ రావు అధ్యక్షతన ఏర్పాటైన సంఘం రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది.
ఎంపికైన వారు వీరే:
డా. చెన్నమనేని హన్మంతరావు (ఆధ్యాత్మిక సాహిత్యం), డా. వెలుదండ వెంకటేశ్వరరావు (ప్రాచీన సాహిత్యం), సంగెవేని రవీంద్ర (సృజనాత్మక సాహిత్యం), ఎన్. గోపాలకృష్ణ (కాల్పనిక సాహిత్యం), చేవూరు సుబ్బారావు (అనువాద సాహిత్యం); డా,రూప్ కుమార్ డబ్బీకార్ (అనువాదం); సంగనభట్ల చిన్న రామకృష్ణయ్య (బాలసాహిత్యం), రేగులపాటి విజయలక్ష్మి(ఉత్తమ రచయిత్రి), చలసాని వసుమతి (ఉత్తమ రచయిత్రి), కె.ప్రభాకర్(వచన కవిత), చెరకు సత్యనారాయణ రెడ్డి (గేయ కవిత), సందాపురంబిచ్చయ్య (పద్యరచన), డా. శాస్త్రుల రఘుపతి (పద్యరచన), కూర చిదంబరం (కథ), చుండూరు సీత (నవల), రాచమళ్ల ఉపేందర్ (హాస్యరచన),ఎస్.ఆర్.పృథ్వి (వివిధ ప్రక్రియలు), నాగబాల సురేష్ కుమార్ (ఉత్తమనాటక రచయిత), దొంతి జంగయ్యగౌడ్ (ఉత్తమ నటుడు), బెంగళూరుపద్మ (ఉత్తమ నటి), అభినయ శ్రీనివాస్ (నాటకరంగంలో కృషి), వెంకు(జనరంజక విజ్ఞానం), డా. గుంజి వెంకటరత్నం (పరిశోధన), ప్రొ. అమరేశం రాజేశ్వర శర్మ (ఛందస్సు), ప్రొ. అన్నంరాజు సుబ్బారావు (సాహిత్య విమర్శ), వల్లూరి రమేష్ (అవధానం), డా.సాకే భారతి (మహిళాభ్యు దయం), విన్నకోట మురళీకృష్ణ (లలిత సంగీతం), డా. చల్లా విజయలక్ష్మి (శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు), తేలు విజయ (జానపద గాయని), వై.గంగాధర్ (జానపద కళలు), డా. షేక్ హసీన (జీవిత చరిత్ర), పరాకుంశం వేణుగోపాలస్వామి (పత్రిక రచన), పేరిణి శ్రీనివాస్ (పేరిణి నృత్యం), డా.చింతా రవి బాలకృష్ణ (కూచిపూడి నృత్యం), ధనంజయ లాడె (సంఘసేవ), టి. రమేష్ (హేతువాద ప్రచారంలో కృషి), ప్రొ. కందిమళ్ల భారతి (గ్రంథాలయ సమాచార విజ్ఞానం), వేముల శ్రీనివాసులు (గ్రంథాలయ కర్త-ముల్కనూరు), వేముల వెంకటేశ్వర్లు (సాంస్కృతిక సంస్థ నిర్వహణ), అలీ (ఇంద్రజాలం), శ్యాంమోహన్ (కార్టూనిస్ట్), డా. సంధ్యాలక్ష్మి (జ్యోతిషం),మేకిరి దామోదర్ (ఉత్తమ ఉపాధ్యాయులు), భార్గవి (చిత్రలేఖనం మహిళ)లకు వర్సిటీ పురస్కారాలు ప్రకటించింది.
త్వరలోనే నగరంలోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లోని వర్సిటీ ప్రాంగణంలో ఎన్టీఆర్ కళామందిరంలో జరిగే ప్రత్యేక ఉత్సవంలో ఒక్కొక్కరికి రూ.5,116 నగదు చొప్పున సత్కరిస్తామని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ తెలిపారు.