ఒక గెలుపు
ఒకరిని ఓడిస్తుంది
ఒక యుద్ధ విజయం
వందల మందిని చంపుతుంది
ఒక గృహం
ప్రేమ మమకారం
ఆప్యాయతానురాగాల
నాల్గు గోడలు
కట్టుకుంటుంది
ఒక కుటుంబం
అమ్మ నాన్న అన్నా తమ్ముడు
అక్క చెల్లి తాతమ్మ
తాతయ్యల మిద్దెల
గొడుగేసు కుంటుంది
నవ ధాన్యాలను
పాడి ,ఫల ,పుష్పా దులను
కోరు కుంటుంది పూజ
వ్రత సత్య ధర్మాల తో
మనుషులమని చాటుకుంటుంది
ఓ సమాజం
ఓ వంశం
పెళ్లి పేరంటాదులతో
శోభన క్రతువులతో
పెంపొందించు కుంటుంది
జన గణాదులలో
గుణగణా లు పొదుగుకుంటూనే
విలువల కట్టుబడులతోనే
నిలబడుతుంది
మానవ సంఘం
సంఘటితమై
వేష భాషలు సంస్కృతి సంప్రదాయాలు
మేమంతా ఒక్కటే
ఒకే మాట ఒకే బాటం టే
అదవుతుంది
అఖండ భారత దేశం
- తిరుమల వేంకటస్వామి
Advertisement