ఆడపిల్లలు

Advertisement
Update:2022-12-17 18:53 IST
ఆడపిల్లలు
  • whatsapp icon

ఆడపిల్లలే అందాల

మందార మాల లవుతారు

అమ్మానాన్నలు అసువులు బాసిన

ఆవేదనతో అశ్రు నివాళులర్పిస్తారు

అత్తగారింటి కెళ్ళినను

అమ్మానాన్నల క్షేమం చూస్తారు

అన్నదమ్ములకు ఆపేక్షతతో

రక్షా బంధన్ కడుతారు

పుట్టినింటికి మెట్టినింటికి

పేరు ప్రతిష్టలు తెస్తారు

ఇంటిపేరు మారినను

ఇంటికి ఇలవేలుపవుతారు

ఆడపిల్లలు సహనానికి ఆనవాళ్లవుతారు

హద్దులు దాటితే అపరకాళి దేవతలవుతారు

ఆడపిల్లలు లేని గృహాలు

అందాలు లేని వనాలు

ఆడది లేని బతుకులు

అడవులు లేని ఎడారులు

కళలకైనా కలలకైనా

కళాత్మకత తో ఉండుటకైనా

కళామ తల్లియే ఆధారం

కళల తల్లికే ఆ హారం

ఆడపిల్లలను కనండి

అనందంగా ఉండండి

ఆడపిల్లలను చదివించండి

ఆ హిమగిరి శిఖరాన్ని అందించండి

భ్రూణ హత్యలను ఖండించండి

భూమాతలను రక్షించండి

అదరకండి బెదరకండి ఆడపిల్లలూ

అదరహో మీరు అదరహో

భలే ఆడపిల్లలూ

-గుడికందుల ప్రకాశం (హనుమకొండ)

Tags:    
Advertisement

Similar News