జ్యోతి

Advertisement
Update:2023-03-29 17:39 IST

మానవాకృతి

యిది యొక మట్టిపిడత

జన్మ జన్మాలనుండి

సంస్కారపుట

మహాగ్నిలోబడి వేగి

లోహమ్ము వోలె

గట్టిపడె నని తలచితిగాని

కంచు కంటె కూడను

పెళుసని కాననైతి;

నింతెకా దంతకంటెను

హీనమైన

మట్టిపెంకనుమాటయే

మరచి పోతి స్వామి :

యీ మట్టిప్రమిదకు

పగులుచూపి

ఓటి మోతలు

చెవి తాకకుండునపుడె;

పగిలి యా మీద మాతృగర్భమ్మునందు

లీయమందక యుండు

నా ప్రాయమందె

దీని కొని దేవ యెట్లేని

మనికి సార్థకము చేసి

జీవి నుత్సాహపరుప

వేడికొందును స్వామి

:నా వేడ్క దీర్పు -

మారి, వాయెo డి,

దప్పిగొన్నట్టి నాదు

హృదయపాత్రికయందు

నీ మృదుల మధుర

స్నేహపూరమ్ము

పొర్లి పోజేసి

లోని దివ్య సంకల్పవర్తి

నుత్తేజపఱచి

వెల్గు విజ్ఞానమును

దాన వెలయజేసి

కొనుము నా స్వామి

దాన నా కొదువ దీరు

సంతనాలోని మాలిన్య మణగి,

చుట్టువారికొని

ధూమసమితినా జేరి పారు :

నపుడు నామూర్తి

భానుసహస్ర మండలమ్మగును

నీ మృదుకరాంబుజ మ్మపుడు

తసంతదా విచ్చికొనుచు

కొండంత యగును

ఏను లేకున్న నీకు రాణింపు లేదు:

నీవు గైకొన్న నాకు లేనిదియె లేదు.

-ఆచార్య శ్రీ వేటూరి ఆనందమూర్తి

Tags:    
Advertisement

Similar News