పితృ దేవోభవ ... ఆచార్య దేవోభవ

Advertisement
Update:2023-06-18 08:53 IST

గురుస్థానం లో బోధకుడిగా

తండ్రి స్థానంలో ప్రబోధకుడిగా

అడ్డాలనాటి నుంచీ

గడ్డాలనాటి వరకూ

తోడుగా, నీడగా

అండగా, ఆలంబనగా

కొలువుకు బయల్దేరుతున్న వేళ

కొండంత ధైర్యాన్నిస్తూ,

ఆనందాన్నీ,

కించిత్తు గర్వాన్నీ,

రెక్కలొచ్చి ఎగరబోతున్న కొడుక్కి

శుభాకాంక్షలు

చెప్పేవేళ ...

గుండెల్లో గుబులును

మునిపంట నొక్కిపెట్టి

కనుకొలకుల్లో చేరిన చెమ్మను చెరిపేసుకుంటూ ...

ధైర్యంగానే ఉన్న అమ్మకి

తన బేలతనాన్ని ఆపాదిస్తూ...

బోలెడంత బోల్డుగా ఉండాలని చెబుతూ ...

కన్ను నొచ్చినా

కాలు నొచ్చినా

కావలి కాసి

కాస్తంత ఉపశమించేవరకూ

కంగారు పడిన

నా నాన్న కి ...

సముద్రమంత సహనశీలి అయిన నాన్నత్వాన్ని సముద్రాల గారు

సంక్షిప్తం చేసినట్టు ...

దేహము.. విజ్ఞానము..

బ్రహ్మోపదేశమిచ్చి

ఇహపరాలు సాధించే

హితమిచ్చిన తండ్రి కి...

నా ఒక్క నాన్నకి మాత్రమే కాకుండా

లోకంలో అందరి నాన్నలకూ ... ప్రేమతో

హ్యాపీ ఫాదర్స్ డే

- సాయి శేఖర్

Tags:    
Advertisement

Similar News