11 సీట్లు కాదు 40 శాతం ఓట్లు.. వైసీపీ కొత్త ప్రచారం

ఈ ఎన్నికల్లో వైసీపీకి 40శాతం ఓట్లు పడ్డాయని, 2029లో జగనే సీఎం అని నమ్మకంగా చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.

Advertisement
Update: 2024-06-26 03:38 GMT

ఏపీ ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన సీట్లెన్ని..? 11

వైసీపీకి వచ్చిన ఓట్లెన్ని..? 40శాతం

ఎన్నికల ఫలితాలు బేరీజు వేయాలంటే ఎవరికైనా సీట్లే ప్రామాణికం. కానీ ఓట్లే ప్రామాణికం అంటోంది వైసీపీ. ఏపీ ఎన్నికల్లో తమకు 40శాతం మంది ప్రజలు మద్దతిచ్చారని చెబుతోంది. 11 సీట్లు అనే విషయాన్ని పక్కనపెట్టి 40శాతం సీట్లు అనే విషయాన్నే హైలైట్ చేయాలనుకుంటోంది. జగన్ కూడా స్పీకర్ కి రాసిన లేఖలో ఈ విషయాన్నే హైలైట్ చేశారు. తమకు 40శాతానికి పైగా ఓట్లు పడ్డాయని చెప్పారాయన. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని స్పీకర్ కు గుర్తు చేశారు జగన్.

2029లో జగనే సీఎం..

ఈ ఎన్నికల్లో వైసీపీకి 40శాతం ఓట్లు పడ్డాయని, 2029లో జగనే సీఎం అని నమ్మకంగా చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. చంద్రబాబు ఎన్ని వాగ్దానాలిచ్చినా, మూడు పార్టీలు కలసినా కూడా తమకు 40శాతం ఓట్లు వచ్చాయని, అందుకే తమని చూసి కూటమి ఇంకా భయపడుతోందన్నారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ప్రభుత్వం ఏది చెబితే అది అధికారులు చేయకూడదని, మళ్లీ వైసీపీయే అధికారంలోకి వస్తుంది కాబట్టి ఆలోచించి పనిచేయాలని హితవుపలికారు.


2029లో జగనే సీఎం అవుతారంటూ ప్రజలు కూడా చెబుతున్నారని వైసీపీ ధీమాగా ఉంది. ఈమేరకు కొంతమంది వైసీపీ అభిమానులు చెబుతున్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 40శాతం ఓటు బ్యాంక్ తో వైసీపీ బలమైన స్థానంలో ఉందని, ఈసారి వైసీపీ అధికారంలోకి రావడం గ్యారెంటీ అని అంటున్నారు. 



Tags:    
Advertisement

Similar News