షూటింగ్, ప్యాకప్.. పవన్ గెటప్‌పై మొదలైన జోకులు

గతంలో షూటింగ్ గ్యాప్ లో షర్ట్ అయినా మార్చుకుని వచ్చేవారని, ఇప్పుడు నేరుగా కారవాన్ లోకి వెళ్లబోయి పవన్ ఏపీలో అడుగు పెట్టారని, ఇక్కడినుంచి నేరుగా ఇంటికి కూడా వెళ్లకుండా షూటింగ్ కే వెళ్తారంటూ సెటైర్లు పేలుస్తున్నారు.

Advertisement
Update:2022-11-05 14:37 IST

విశాఖ గొడవ తర్వాత ప్రెస్ మీట్ లో చెప్పు చూపించి తీవ్ర విమర్శలు చేసిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయారు. మళ్లీ ఇప్పుడు ఇప్పటం ఇష్యూతో ఏపీలో అడుగుపెట్టారు. ఈ గ్యాప్ లో పవన్ ఏం చేశారనేది బహిరంగ రహస్యం, ఆయన సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఇప్పటం ఎపిసోడ్ అయిపోయాక కూడా ఆయన తిరిగి సినిమా షూటింగ్ కే వెళ్తారు. మరి ఈ షూటింగుల మధ్య గ్యాప్ లో ఎందుకీ హడావిడి అంటూ ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.

సహజంగా పవన్ కల్యాణ్ ఏపీకి వస్తే లాల్చీ పైజమా, లేదా కుర్తా వేసుకుని వస్తారు. కళ్లద్దాలు, బొట్టు.. ఆయన స్టైల్ వేరేగా ఉంటుంది. కానీ ఇప్పటంలో పవన్ జీన్స్, టీషర్ట్, పైన జర్కిన్ తో సినిమా స్టైల్లో దిగిపోయారు. ఈ గెటప్పే ఇప్పుడు వైసీపీ నుంచి విమర్శలు మొదలయ్యేలా చేసింది. గతంలో షూటింగ్ గ్యాప్ లో షర్ట్ అయినా మార్చుకుని వచ్చేవారని, ఇప్పుడు నేరుగా కారవాన్ లోకి వెళ్లబోయి పవన్ ఏపీలో అడుగు పెట్టారని, ఇక్కడినుంచి నేరుగా ఇంటికి కూడా వెళ్లకుండా షూటింగ్ కే వెళ్తారంటూ సెటైర్లు పేలుస్తున్నారు. పవన్ కల్యాణ్ కొత్త గెటప్ తో జనసైనికులు సంబరపడిపోతుంటే, వైసీపీ నేతలు మాత్రం సినిమా స్టైల్లో వచ్చి జనం సమస్యలు ఎలా పరిష్కరిస్తారంటూ ఎద్దేవా చేస్తున్నారు. పవన్ కి సినిమాలే బెటర్ అని సలహాలిస్తున్నారు.

ఇప్పటంలో పవన్ పవర్ ఫుల్ స్పీచ్ రాగానే వైసీపీ నుంచి రియాక్షన్లు మొదలయ్యాయి. అదే సందర్భంలో సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు పవన్ ని టార్గెట్ చేశారు. పవన్ కల్యాణ్ గతంలో కనీసం పొలిటికల్ గెటప్ వేసుకునేవారని, ఇప్పుడు అంత గ్యాప్ లేకపోవడంతో కాల్షీట్లు వృథా చేయడం ఎందుకని సినిమా గెటప్ తో దిగిపోయాడంటూ టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటంలో ధర్నా అయిపోయిన వెంటనే ఆయన పొలిటికల్ ఎపిసోడ్ కి ప్యాకప్ చెప్పి, తిరిగి షూటింగ్ మూడ్ లోకి వెళ్లిపోతారని అంటున్నారు. పవన్ కు ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి లేదని, ఇలా వచ్చి అలా వెళ్లిపోవడమే ఆయనకు తెలిసిన పని అంటూ విమర్శిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News