పురందేశ్వరి.. ఊసరవెల్లి..

సమాజాభివృద్ధి కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పురందేశ్వరి విమర్శించడం హాస్యాస్పదమన్నారు.

Advertisement
Update:2024-02-02 11:42 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఊసరవెల్లి అని భీమవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గ్రంధి శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊసరవెల్లిలా పార్టీలు మార్చే ఆమె వైసీపీని విమర్శించడం తగదన్నారు. పార్టీలు మారడం అలవాటైన, ఏ పార్టీలో ఉండేదీ ఆమెకే తెలియదని ఎద్దేవా చేశారు. బీజేపీలో ఉంటూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న పురందేశ్వరి తీరును చూసి, ఆమె మాటలు విని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన తెలిపారు.

సీఎం జగన్‌పై విమర్శలు హాస్యాస్పదం

గురువారం సాయంత్రం ఆయన భీమవరంలో విలేకరులతో మాట్లాడుతూ.. సమాజాభివృద్ధి కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పురందేశ్వరి విమర్శించడం హాస్యాస్పదమన్నారు. ఇచ్చిన వాగ్దానాలు నూటికి నూరు శాతం అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లాంటి నాయకుడిని భారతదేశ చరిత్రలో చూడలేదన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా విద్య, వైద్యం, ఆర్థిక పరంగా చితికిపోకూడదనే సమున్నత ఆశయంతో జగన్‌ ముందుకెళుతున్నారని ఆయన తెలిపారు.

పవన్, బాబులకు సవాల్‌

పవన్‌ అయినా, చంద్రబాబు అయినా దమ్ముంటే భీమవరంలో తనపై పోటీ చేసి గెలవాలని గ్రంధి శ్రీనివాస్‌ సవాల్‌ చేశారు. భీమవరంలో తనపై పోటీ చేసేందుకు పవన్‌ కల్యాణ్‌ భయపడుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో పేదల గురించి అసలు పట్టించుకోలేదని, అసలు ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మేనిఫెస్టోని పార్టీ సైట్‌ నుంచే తొలగించిన నీచ చరిత్ర చంద్రబాబుదని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News