చంద్రబాబు, జగన్.. ఉద్యోగులకు మేలు చేసిందెవరు..?
అధికారంలో ఉన్నప్పుడు 4పెండింగ్ డీఏలు ఇవ్వాలని అడిగితే చంద్రబాబు ఏమన్నారంటే..? " అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటాను కానీ డీఏలు ఇచ్చేది లేదు" అని మొండికేసిన చరిత్ర చంద్రబాబుది.
ఏపీలో సంక్షేమ పథకాల లబ్ధిదారులెవరూ చంద్రబాబుకి ఓటు వేసే పరిస్థితి లేదు. చేతి వృత్తులవారు, ఎస్సీ, ఎస్టీలు కూడా కూటమివైపు చూడటం లేదు. ఇక ముస్లింల ఓటు ఒక్కటి కూడా కూటమికి పడే అవకాశం లేదు. ఈ దశలో యువతకు, ఉద్యోగులకు మాయమాటలు చెప్పి తనవైపు తిప్పుకోవాలని చూస్తోంది టీడీపీ. ఉద్యోగులు, పెన్షనర్లను వైసీపీకి దూరం చేసేందుకు ఎల్లో మీడియా తప్పుడు కథనాలిస్తోంది. అసలు ఈ కథనాల్లో వాస్తవం ఎంత..? ఉద్యోగులకు మేలు చేసిన ముఖ్యమంత్రి ఎవరు..? చంద్రబాబు..? జగనా..?
చంద్రబాబు హయాంలో ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగింది. జన్మభూమి కమిటీ మీటింగుల్లో చోటా మోటా నేతలు కూడా ఉద్యోగులపై తిట్లదండకం అందుకునేవారు, వారిని నీఛంగా చూసేవారు. అధికారంలో ఉన్నప్పుడు 4పెండింగ్ డీఏలు ఇవ్వాలని అడిగితే చంద్రబాబు ఏమన్నారంటే..? " అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటాను కానీ డీఏలు ఇచ్చేది లేదు" అని మొండికేసిన చరిత్ర చంద్రబాబుది. ఇలాంటి నీఛమైన చరిత్ర ఉన్న చంద్రబాబు, జగన్ పై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు, ఏపీ ఎన్‌జీవో మాజీ అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి.
జగన్ ఏమేం చేశారంటే..?
- జగన్ హయాంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది, ఆ కౌన్సిల్ ఏడాదిలో ఏడెనిమిది సార్లు సమావేశమై ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తోంది.
- జగన్ హయాంలో 10,177 మంది ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేశారు.
- వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్న 11 వేల మందికి 010 పద్దు కింద జీతాలిచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. 1.35 లక్షలమందిని సచివాలయాల్లో నియమించారు.
- 12వ పే రివిజన్ కమిషన్ వేసి, జులై నుంచి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
- మే నెలతో పాటు ఒక డీఏ ఇస్తున్నారు, జూన్‌లో మరో డీఏ ఇస్తామని హామీ ఇచ్చారు.
- సీపీఎస్ వల్ల ప్రభుత్వంపై ఎక్కువ భారం పడుతుందనే జీపీఎస్ తీసుకొచ్చారు.
- కీలకమైన విద్య, వైద్యరంగాల్లో ఖాళీలన్నీ భర్తీ చేశారు
- ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచారు
- ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిస్తున్నారు
- చిన్న స్థాయి ఉద్యోగులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు
- పాత జిల్లాలతో పాటు కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న వారికి కూడా 16 శాతం హెచ్‌ఆర్‌ఏ వర్తింపజేశారు
- మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ 2 నెలల నుంచి 6 నెలలకు పెంచింది జగన్ హయాంలోనేె
- కొవిడ్ వల్ల రాష్ట్రానికి రూ.76వేల కోట్ల నష్టం వాటిల్లడం వల్లే జీపీఎఫ్, సరెండర్ లీవులు, టీఏ, ఏపీజీఎల్ఐ ఇవ్వడంలో కొంత ఆలస్యం జరిగింది కానీ ఈ విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోంది.
- పీఎఫ్ బకాయిలు రూ.25వేల కోట్లు అనేది అసత్యం. 11వ పీఆర్సీ అరియర్స్ మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి.
వాస్తవాలు ఇవీ అంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు, ఏపీ ఎన్‌జీవో మాజీ అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి మీడియాకు వివరించారు. ఎల్లో మీడియా మాత్రం ఎన్నికల టైమ్ లో పదే పదే తప్పుడు ప్రచారం చేస్తూ ఉద్యోగులు, పెన్షనర్ల మనసుల్లో విషబీజాలు నాటాలని చూస్తోంది. మంచి చేసిన వైసీపీ ప్రభుత్వానికి వారిని దూరం చేయాలని చూస్తోంది.