ఆ ఛానెల్ ని వదిలిపెట్టను.. వరుస ట్వీట్లతో విజయసాయి ర్యాగింగ్

సదరు న్యూస్ ఛానెల్ లో పనిచేసే సిబ్బందిలో ఎంత మందికి జీతాలిస్తున్నారని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. రిపోర్ట‌ర్ల‌కు జీతాలు ఇవ్వ‌కుండా వారిని క‌లెక్ష‌న్ ఏజెంట్లుగా మార్చేశారని మండిపడ్డారు.

Advertisement
Update:2024-07-21 11:20 IST

డబ్బా

పౌడర్ డబ్బా

టాల్కమ్ పౌడర్ డబ్బా..

అంటూ వరుస ట్వీట్లతో ఆ న్యూస్ ఛానెల్ యజమానిపై ఘాటు ట్వీట్లు వేస్తున్నారు విజయసాయిరెడ్డి. ఆ ఛానెల్ చేసిన దందాలు అన్నీ ఇన్నీ కావని కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. జర్నలిస్ట్ లను అవమానించారని అంటున్న ఆ ఛానెల్ యజమాని.. అక్కడ పనిచేసే ఉద్యోగుల్ని అరేయ్, ఒరేయ్ అని పిలుస్తారని, బూతులు తిడుతుంటారని అన్నారు. ఆ యన ప్రైవేట్ సైన్యంలో కొందరు న్యూస్ ఛానెల్ లో పనిచేసే మహిళా యాంకర్ తో అసభ్యంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోలేదన్నారు. అలాంటి వారు నీతి, న్యాయం గురించి మాట్లాడటం, జర్నలిస్ట్ విలువలు, ఫోర్త్ ఎస్టేట్ గురించి ప్రస్తావించడం హాస్యాస్పదం అన్నారు విజయసాయిరెడ్డి.


మేదరమెట్లలో వీధి బండి పెట్టి చికెన్ పకోడీలు అమ్ముకొనే సదరు వ్యక్తికి.. ఛానెల్ కొనడానికి డ‌బ్బులు ఎక్క‌డివని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. యాడ్స్ రూపంలో ఎంత ఆదాయం వస్తుంది..? మిగిలిన‌వి ఎక్క‌డి నుంచి తెస్తున్నారు? అని ట్వీట్ ద్వారా అడిగారు. హైద‌రాబాద్‌లోని రియ‌ల్ ఎస్టేట్ కంపెనీల‌పై ప్రోమోలు న‌డిపి వారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసేవారని, బ్లాక్ మెయిల్ చేసేవారని చెప్పారు. మేట‌ర్ సెటిలైతే క‌థ‌నాలు ఆపేయ‌డం ఆయనకు మామూలేనన్నారు విజయసాయిరెడ్డి.

సదరు న్యూస్ ఛానెల్ లో పనిచేసే సిబ్బందిలో ఎంత మందికి జీతాలిస్తున్నారని.. రిపోర్ట‌ర్ల‌కు జీతాలు ఇవ్వ‌కుండా కేవ‌లం యాడ్స్ డిమాండ్ చేసి క‌మీష‌న్లతో సరిపెట్టేవారని, వారిని క‌లెక్ష‌న్ ఏజెంట్లుగా మార్చేశారని మండిపడ్డారు విజయసాయిరెడ్డి. అలాంటివారు జ‌ర్న‌లిజం గురించి పాఠాలు చెప్పడమేంటని ఎద్దేవా చేశారు. అసలు ఆ ఛానెల్ లో సిబ్బందికి పీఎఫ్‌లు చెల్లిస్తున్నారా, లేదా అని నిలదీశారు విజయసాయిరెడ్డి. చంద్ర‌బాబు పీఆర్వో ర‌మేష్‌తో ఆ ఛానెల్ యజమానికి ఉన్న సంబంధాలు ఏంటని ప్రశ్నించారు. చంద్ర‌బాబు, లోకేష్‌కు ద‌గ్గ‌ర‌కావ‌డానికి చేస్తున్న ప్ర‌య‌త్నాలేంటని అడిగారు. ఛానెల్ ను అడ్డు పెట్టుకుని క‌వ‌రేజ్ అంటూ ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ అభ్య‌ర్థుల నుంచి కోట్ల‌లో సొమ్ము దండుకున్న‌ది నిజం కాదా? అని నిలదీశారు విజయసాయిరెడ్డి.

Tags:    
Advertisement

Similar News